ముంబై: పంజాబ్ కింగ్స్‌తో కీలక పోరుకు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్‌శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల గాయంతో రోహిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డ హిట్‌మ్యాన్..మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్ చేరాడు.
అయితే రోహిత్ ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన రోహిత్ కొద్దిసేపు నెట్స్‌లో గడిపాడు. నెట్స్ బౌలర్లతో పాటు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే నెట్స్‌లో ఉన్నంతసేపు పెద్దగా ఇబ్బంది పడినట్లు కనిపించని హిట్‌మ్యాన్ లైట్ డ్రిల్స్‌తో పాటు జాగింగ్ చేస్తూ కనిపించాడు. ఇప్పటికే వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న ముంబైకి పంజాబ్‌తో పోరు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ రోహిత్‌ను ఆడించాలనుకుంటే ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆల్‌రౌండర్ విల్‌జాక్స్ త్వరలో జట్టులో చేరనున్నాడు.