WPL Final 2023 | మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేత ముంబై ఇండియన్స్
టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచింది. బలమైన ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitalsపై హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై చెలరేగిన నాట్ స్కీవర్ బ్రంట్(60) అర్ధ శతకం బాది ముంబైని గెలిపించింది.
WPL Final 2023 : టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న హర్మన్‌ప్రీత్ సేన చాంపియన్‌గా అవతరించింది. బలమైన ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి ఢిల్లీని తక్కువకే కట్టడి చేసిన ముంబై.. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ స్కీవర్ బ్రంట్ సాధికార ఇన్నింగ్స్ ఆడడంతో సులువుగా విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు పోరాడిన ఢిల్లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో వరుసగా ఐదు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ ఫైనల్లోమ్యాచ్లో సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై చెలరేగిన నాట్ స్కీవర్ బ్రంట్(60) అర్ధ శతకం బాది ముంబైని గెలిపించింది. 132 లక్ష్య ఛేదనలో ముంబై 23 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. హేలీ మాథ్యూస్(13), యస్తికా భాటియా (4) తొందరగానే ఔటయ్యారు. దాంతో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(37)తో కలిసి బ్రంట్ మూడో వికెట్‌కు 72 రన్స్ జోడించింది. హర్మన్‌ప్రీత్ రనౌట్ అయింది. అప్పటికే అప్పటికే ముంబై విజయం ఖాయమైంది. మేలియా కేర్ (14) లాఛనంగా మ్యాచ్ ముగించారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, అలిసే తలా ఒక వికెట్ తీశారు.
శిఖా, రాధ ధనాధన్
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఇసీ వాంగ్ దెబ్బకొట్టింది. తన మొదటి ఓవర్లోనే లో ఫుల్ టాస్ బంతులతో కీలకమైన ఓపెనర్ షఫాలీ వర్మ(11), అలిసే క్యాప్సే(0)లను ఔట్ చేసింది. దాంతో, 12 పరుగులకే ఢిల్లీ ప్రధాన వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మేగ్ లానింగ్ (35), మరినే కాప్ (18), జెమీమా రోడ్రిగ్స్ (9), జొనాసెన్ (2), అరుంధతి రెడ్డి(0) విఫలమయ్యారు. ఒక దశలో ఆ జట్టు 80 రన్స్ లోపే ఆలౌట్ అవుతుందనిపించింది. కానీ, చివర్లో రాధా యాదవ్(27), శిఖా పాండే (27) బ్యాట్ ఝులిపించడంతో పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. ధాటిగా ఆడిన శిఖా, రాధ పదో వికెట్‌కు ఏకంగా 52 రన్స్ కొట్టారు. ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మేలియా కేర్ రెండు వికెట్లు తీసింది.
𝗣𝗥𝗘𝗦𝗘𝗡𝗧𝗜𝗡𝗚 𝗧𝗛𝗘 𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗢𝗙 #𝗧𝗔𝗧𝗔𝗪𝗣𝗟!
CONGRATULATIONS @mipaltan 👏👏#TATAWPL | #DCvMI | #Final pic.twitter.com/2NqPLqk9gW
— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
ఇవి కూడా చదవండి
Shikhar Dhawan | ప్రేమలో పడ్డప్పుడు అవేవీ తెలియవు.. వైవాహిక జీవితంలో విఫలమయ్యా : శిఖర్ ధావన్
Nikhat Zareen | ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ పసిడి పంచ్.. మేరీ కామ్ రికార్డు సమం చేసిన ఇందూరు బిడ్డ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

