చెన్నై : నెలల తరబడి ఐపీఎల్కోసం సన్నద్ధం కావడం తనపై ఎంతో భారం పెరిగనట్టవుతోందని చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. తన రిటైర్మెంట్పై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇంకా ఎనిమిది.. తొమ్మిది నెలల సమయముందన్నాడు. ప్రస్తుత సీజనే ధోనీకి చివరిదని పలువురు భావిస్తున్నా ధోనీ మాత్రం ఆ విషయమై నోరు మెదపడం లేదు.
మంగళవారం గుజరాత్‌పై విజయానంతరం ధోనీ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ తనపై ఎంతో భారం వేసిందని, తాను నాలుగు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్నానన్నాడు. ఐపీఎల్ తనపై ఎంతో భారాన్ని మోపిందని, డిసెంబర్లో వేలం జరిగే నాటికి ఒక నిర్ణయం తీసుకుంటానని ధోనీ తెలిపాడు.