FIFA World Cup: రసవత్తర పోరులో నెదర్లాండ్స్ ఓటమి.. షూటౌట్లో మొరాక్కో గెలుపు
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో.. మొరాక్కొ పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. మాంటెర్రిలో జరిగిన మ్యాచ్‌లో తొలుత రెండు జట్లు 1-1 గోల్స్‌తో డ్రా చేసుకున్నాయి. అయితే షూటౌట్లో 3-2 గోల్స్ తేడాతో మొరాక్కో స్టన్నింగ్ విక్టరీ కొట్టింది.
మాంటెర్రి: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో మరో మ్యాచ్ థ్రిల్లర్‌లా సాగింది. నెదర్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో.. మొరాక్కొ పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. మాంటెర్రిలో జరిగిన మ్యాచ్‌లో తొలుత రెండు జట్లు 1-1 గోల్స్‌తో డ్రా చేసుకున్నాయి. అయితే షూటౌట్లో మొరాక్కోను విక్టరీ వరించింది. దీంతో ప్రీ క్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మొరాక్కో. వాస్తవానికి రెండు జట్లు ఆరంభం నుంచి హోరాహోరీగా పోటీపడ్డాయి. ఫస్ట్ హాఫ్‌లో మొరాక్కో కాస్త ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక రెండో హాఫ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్ గాప్కో 72వ నిమిషంలో గోల్ చేసి ఆ జట్టకు ఆధిక్యాన్ని అందించాడు. కానీ మ్యాచ్ ముగిసే సమయానికి మొరాక్కో అద్భుతంగా ఓ గోల్ చేసింది. 91వ నిమిషంలో ఇస్సా డయోప్ కొట్టిన గోల్‌తో మ్యాచ్ డ్రా అయ్యింది. ఎక్స్ టైంలో రెండు జట్లు గోల్స్ చేయలేదు. దీంతో పెనాల్టీ షూటౌట్ ఆడాల్సి వచ్చింది. డచ్ ఆటగాళ్లు మూడు స్పాట్ కిక్‌లను కోల్పోయారు. ఇస్మాయిల్ సైబరి గోల్ చేయడంతో 3-2 గోల్స్ తేడాతో మొరాక్కో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసింది. శనివారం జరిగే రౌండ్16లో.. కెనడాతో ఆ జట్టు తలపడనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

