Mohammad Shami | భారత పేసర్ షమీ అరుదైన రికార్డు.. కోహ్లీని దాటేశాడు
భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టుల్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫార్మాట్లో 25 సిక్సర్లు బాదిన షమీ, కోహ్లీని దాటేశాడు. కోహ్లీ ఖాతాలో 24 సిక్సర్లు ఉన్నాయి.
Mohammad Shami : భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును అతను బ్రేక్ చేశాడు. అదెలాగా.. అని ఆశ్చర్యపోతున్నారా..! నిజమే.. ఈ ఫార్మాట్లో 25 సిక్సర్లు బాదిన షమీ, కోహ్లీని దాటేశాడు. కోహ్లీ ఖాతాలో 24 సిక్సర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో అతను ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ 4 సిక్సర్లు బాదాడు.
మర్ఫీ ఓవర్లోనే మూడు
ఏడు వికెట్లు తీసిన మర్ఫీ బౌలింగ్‌లో షమీ మూడు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, అప్పటిదాకా భారత బ్యాటర్లను హడలెత్తించిన టాడ్ మర్ఫీ.. షమీ దెబ్బకు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దూకుడుగా ఆడిన షమీ 47 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతితోనూ చెలరేగి రెండు వికెట్లు తీశాడు. అశ్విన్ 5 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ ఓటమి ఖాయం అయింది. జడేజా, అక్షర్ పటేల్ ఇండియా ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
సెహ్వాగ్ టాప్
ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా..? మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ విధ్వంసక ఆటగాడు 91 సిక్స్‌లు బాదాడు. మాజీ కెప్టెన్ ధోనీ 98 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ (69), రోహిత్ శర్మ (66), కపిల్ దేవ్ (61) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి, మాజా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ ఉమేశ్ యాదవ్ తలా 22 సిక్సర్లు బాదారు.
Shami 🔥 pic.twitter.com/LlrOFds6xd
— 📂 (@Cricketfiles18) February 11, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

