తెలంగాణలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం.. కేంద్రమంత్రి ఆశ్చర్యం
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాతీయ క్రీడలు జరుగుతున్న
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్‌లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రగతిపై ఆయన కేంద్ర మంత్రికి వివరించారు.
రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అందిస్తున్న వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న అంశంపై కేంద్రమంత్రి ఆశ్చర్యపోయారు. కామన్వెల్త్ క్రీడల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భేటీలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా ఉన్నారు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

