వెల్డన్.. వంశీధర్‌రెడ్డి
- అంతర్జాతీయ ఖోఖో ప్లేయర్‌కు మంత్రి కేటీఆర్ అభినందన

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 18: అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వంశీధర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన తాడ అరుణ-శ్రీనివాస్‌రెడ్డి దంపతుల కుమారుడు వంశీధర్‌రెడ్డి చిన్నప్పటి నుంచి ఖోఖోలో రాణిస్తున్నాడు. గత జూన్‌లో వరంగల్‌లో జరిగిన స్టేట్ మీట్లో తెలంగాణ తరుఫున ఆడాడు. జూలై 23 నుంచి 25 వరకు జామ్‌నగర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటి భారతజట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 14,15 తేదీల్లో నేపాల్ రాజధాని కాట్మండులో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో భారత జట్టు పసిడి పతకం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వంశీ ప్రతిభను స్థానిక నేతలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ప్రగతిభవన్‌కు వంశీని పిలిపించుకుని వెల్డన్ అంటూ మంత్రి అభినందించారు. హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ కాలేజీలో అడ్మిషన్ కోసం ఆయన సిఫారసు చేశారు. ఈ సందర్భంగా వంశీధర్‌రెడ్డి తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

