టెక్సాస్: మైక్ టైసన్(Mike Tyson) తన మొండి ప్రవర్తన ఏంటో మరోసారి చూపించాడు. యూట్యూబర్, బాక్సర్ జేక్ పౌల్‌తో ఇవాళ బిగ్ బౌట్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు ముందు.. ఇద్దరు బాక్సర్ల వెయిటేజీ ఈవెంట్ జరిగింది. టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్ ఏటీ స్టేడియంలో జరగనున్న ఫైట్ కోసం ఇద్దరు బాక్సర్లు ప్రిపేర్ అయ్యారు. బరువు కొలిచే ఈవెంట్ జరుగుతున్న సమయంలో.. ప్రత్యర్థి పౌల్‌పై ఐరన్ మైక్ చేయి చేసుకున్నాడు. తన కుడి చేతితో పౌల్ చెంప చెల్లుమనిపించాడు టైసన్. అయితే అక్కడ ఉన్న సెక్యూర్టీ త్వరగా తేరుకుని.. ఆ ఇద్దరు బాక్సర్లను అడ్డుకున్నారు. టైసన్‌ను దూరం తీసుకెళ్లారు.
కేవలం అండర్ గార్మెంట్ వేసుకుని వెయిటేజీకి వచ్చిన టైసన్.. 228.4 పౌండ్ల బరువు ఉన్నాడు. ఇక 27 ఏళ్ల బాక్సర్ పౌల్ 227.2 పౌండ్ల బరువు ఉన్నాడు. టైసన్ చెంప దెబ్బ కొట్టడం పట్ల బాధ ఏమీ లేదని పౌల్ తెలిపాడు. టైసన్ ఆవేశంతో ఉన్నాడని, చాలా క్యూట్‌గా కొట్టాడని పౌల్ పేర్కొన్నాడు. మ్యాచ్ 8 రౌండ్లు సాగనున్నది. ఒక్కొక్క రౌండ్ రెండేసి నిమిషాలు ఉంటుంది. ఈ ఫైట్ కోసం టైసన్‌కు 20 మిలియన్ల డాలర్లు చెల్లిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో బాక్సింగ్ బౌట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే 19 ఏళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ హెవీవెయిట్ ఫైట్‌కు టైసన్ ప్రిపేర్ కావడం పట్ల అనేక మంది స్టార్ బాక్సర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MIKE TYSON HITS JAKE PAUL AT THE WEIGH IN #PaulTyson
—
LIVE ON NETFLIX
FRIDAY, NOVEMBER 15
8 PM ET | 5 PM PT pic.twitter.com/kFU40jVvk0— Netflix (@netflix) November 15, 2024