Michael Vaughan : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అద్భుతాలు చేయడానికి అతడేమి హ్యారీపోర్టర్ లేదా సూపర్‌మ్యాన్ కాదు అని అన్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు ఆసీస్ ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడంపై వాన్ స్పందించాడు. నాగ్‌పూర్ టెస్టులో అతను ఉన్నా కూడా ఎలాంటి అద్భుతం చేసేవాడు కాదని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఏమి హ్యారీ పోర్టర్ లేదా సూపర్‌మ్యాన్ కాదు.
తొలి టెస్టులో ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా ఓడిపోయింది’ అని వాన్ అన్నాడు. నాగ్‌పూర్ టెస్టులో గ్రీన్ ఆడిఉంటే ఆసీస్ ధీటుగా బదులిచ్చేదని, అంత దారుణ ఓటమి మూటగట్టుకునేది కాదని కొందరు మాజీలు వ్యాఖ్యానించారు. దాంతో, మైఖేల్ వాన్ ఇలా స్పందించాడు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గ్రీన్ గాయపడ్డాడు. అతడి వేలికి గాయం అయింది. దాంతో, అతను భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే.. గ్రీన్ ఇంకా కోలుకోకపోవడం ఆసీస్‌ను కలవర పెడుతోంది. ఎందుకంటే.. టీమిండియాపై మెరుగైన రికార్డు ఉన్న గ్రీన్‌పై ఆస్ట్రేలియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై ఆ జట్టు యాజమాన్యం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. టీమిండియాపై మెరుగైన రికార్డు ఉన్న గ్రీన్‌పై ఆస్ట్రేలియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ కూడా రెండో టెస్టులో ఆడేది అనుమానమే.
నాగ్‌పూర్ జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో పర్యాటక ఆసీస్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ (120) కొట్టడంతో భారత్ ధీటుగా స్పందించింది. చివర్లో జడ్డూ, అక్షర్ పటేల్ అర్థ శతకాలు బాదారు. షమీ కూడా ధనాధన్ ఆడి 47 రన్స్ చేశాడు. దాంతో, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 400 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ (5 వికట్లు) జడేజా (2 వికెట్లు) చెలరేగడంతో ఆస్ట్రేలియా 91 రన్స్‌కే ఆలౌట్ అయింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీలో ప్రారంభం కానుంది.