MI vs KKR : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో వరుసగా ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ సవాల్‌కు సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో కోల్‌కతాపై పది విజయాలతో రికార్డు నెలకొల్పిన ముంబై.. అదిరే ఆటతో టోర్నీని మొదలెట్టాలనే కసితో ఉంది.
సొంత మైదానంలో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రధాన పేసర్లు గాయాలతో టోర్నీకి దూరమవ్వగా.. అనుభవంలేని బౌలర్లతో ఆడుతున్న అజింక్యా రహానే బృందాన్ని బ్యాటర్లే ఆదుకోవాల్సి ఉంది.
🚨 Toss 🚨@mipaltan have won the toss and elected to bowl first against @KKRiders in Match 2⃣
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR pic.twitter.com/GgI4BwiTd7
— IndianPremierLeague (@IPL) March 29, 2026
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, శార్ధూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఘజన్ఫర్, బౌల్ట్, బుమ్రా.
కోల్‌కతా తుది జట్టు : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీ.
ఇంప్యాక్ట్ సబ్స్ – ముంబై : సూర్యకుమార్ యాదవ్, కార్బిన్ బాస్చ్, రాబిన్ మిన్జ్, రాజ్ బవా, అశ్వనీ కుమార్.
కోల్‌కతా : మనీశ్ పాండే, రొవ్మన్ పావెల్, కార్తిక్ త్యాగి, సౌరభ్ దూబే, తేజస్వీ దహియా.