ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్‌కతా బ్యాటర్లు తడబడుతున్నారు. ఓపెనర్లు అజింక్య రహానే (7), వెంకటేశ్ అయ్యర్ (9 నాటౌట్) ఇద్దరూ వేగంగా ఆడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే స్కోరు వేగం పెంచడానికి ప్రయత్నించిన రహానే..
టైమల్ మిల్స్ బౌలింగ్‌లో షార్ట్ బంతికి అవుటయ్యాడు. షార్ట్ పిచ్ బాల్‌ను పుల్ చేయడానికి ప్రయత్నించిన రహానే.. డీప్ మిడ్‌వికెట్ దగ్గర శామ్స్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోల్‌కతా 16 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.