Lionel Messi | ‘మరొక విజయంతో లీగ్ దశను ముగించా’.. మెస్సీ పోస్ట్ వైరల్..!
Lionel Messi : నాలుగేళ్ల క్రితం అర్జెంటీనాకు వరల్డ్‌కప్ అందించిన లియోనల్ మెస్సీ (Lionel Messi) ఈసారి మరింతగా రెచ్చిపోతున్నాడు. జోర్డాన్‌పై 3-1తో అదిరే విజయం అనంతరం మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
Lionel Messi : నాలుగేళ్ల క్రితం అర్జెంటీనాకు వరల్డ్‌కప్ అందించిన లియోనల్ మెస్సీ (Lionel Messi) ఈసారి మరింతగా రెచ్చిపోతున్నాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో టోర్నీని ఆరంభించిన ఈ దిగ్గజం..ప్రతి మ్యాచ్‌లో మెరుస్తున్నాడు. జోర్డాన్‌పై 3-1తో అదిరే విజయం అనంతరం మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘మరొక విజయంతో లీగ్ దశను ముగించాం. మేమంతా కలిసే ఉన్నాం ‘ అని అతడు పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరలైంది.
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తిరుగులేని ఆటతో ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్‌కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న మెస్సీ సేన 32వ రౌండ్లోనూ దూసుకెళ్లాలని భావిస్తోంది. తమ జట్టు నాకౌట్ బెర్తుతోనే సంబురపడిపోదని కెప్టెన్ మెస్సీ అంటున్నాడు.
జోర్డాన్‌పై విజయం అనంతరం అతడు ”మరొక విజయంతో లీగ్ దశను ముగించాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అల్జీరియా హ్యాట్రిక్ గోల్స్‌తో తానేంటో చాటిన మెస్సీ.. మొత్తంగా 19 గోల్స్‌తో రికార్డు నెలకొల్పాడు. ఆరో ఎడిషన్ వరల్డ్‌కప్ ఆడుతున్న ఈ లెజెండ్.. అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. జూన్ 29 సోమవారం కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో 32వ రౌండ్ మొదలవ్వనుంది. జూలై 4, శనివారం ఉదయం 3:30 గంటలకు కాబొ వెర్డెను అర్జెంటీనా ఢీకొట్టనుంది.
Lionel Messi scoring his sixth #FIFAWorldCup 2026 goal in style ✨ pic.twitter.com/k8MLga0c9C
— FIFA World Cup (@FIFAWorldCup) June 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

