World Cup 2026 Qualifiers | మెస్సీ సూపర్ గోల్.. ఈక్వెడార్‌పై అర్జెంటీనా విజయం
World Cup 2026 Qualifiers : డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా(Arjentina) 2026 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ (World Cup 2026 Qualifiers)లో అదరగొట్టింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) సూపర్ గోల్‌తో ఈక్వెడార్(Ecuador)పై అద్భుత విజయం సాధించింది. ఇంటర్ మియామి తరఫున...
World Cup 2026 Qualifiers : డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా(Arjentina) 2026 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ (World Cup 2026 Qualifiers)లో అదరగొట్టింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) సూపర్ గోల్‌తో ఈక్వెడార్(Ecuador)పై అద్భుత విజయం సాధించింది. ఇంటర్ మియామి తరఫున ఇరగదీసిన మెస్సీ అదే జోరు కొనసాగించాడు. ఈ స్టార్ ఫుట్‌బాలర్ రెండో అర్థ భాగంలో గోల్ చేయడంతో 1-0తో విక్టరీ కొట్టింది.
‘వరల్డ్ చాంపియన్ అయిన మా జట్టును ఓడించాలని అందరూ అనుకుంటారు. అందుకని మేము ఎప్పుడూ రిలాక్స్ అవ్వం. నిరంతరం మా ఆటను మెరుగుపర్చుకుంటూనే ఉంటాం. ఈరోజు మేము బలమైన జట్టుతో ఆడాం. మంచి ఆటగాళ్లు, శారీరకంగా బలవంతులైన వాళ్లతో తలపడ్డాం. వరల్డ్ కప్ పోటీలకు మళ్లీ అర్హత సాధించాలనేదే మా లక్ష్యం. ఈ విజయం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అని మ్యాచ్ అనంతరం మెస్సీ తెలిపాడు.
LIONEL MESSI FREE KICK GOAL! 🇦🇷pic.twitter.com/yAsas0pRTQ
— Roy Nemer (@RoyNemer) September 8, 2023
ఆట ఆరంభంలో ఆర్జెంటీనా, ఈక్వెడార్ ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ ఎవరూ సక్సెస్ కాలేదు. అయితే.. 77వ నిమిషంలో మెస్సీ మ్యాజిక్ చేశాడు. దాంతో, అర్జెంటీనా బోణీ కొట్టింది. మరో క్వాలిఫయర్స్‌లో పరాగ్వే, పెరూ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కొలంబియా 1-0తో వెనుజులాను చిత్తు చేసింది.

గత ఏడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్(fifa world cup 2022)లో అర్జెంటీనా చాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో 5-4తో ఫ్రాన్స్‌ను ఓడించింది. దాంతో, మెస్సీ తన వరల్డ్ కప్ ట్రోఫీ కలను నిజం చేసుకున్నాడు. అనంతరం పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్‌ను వీడిన మెస్సీ అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌కు మారిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Australia Womens Team | వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్.. ఆసీస్ కొత్త కెప్టెన్‌గా అలిసా హీలీ
Virender Sehwag | సెహ్వాగ్ డ్రీమ్ వన్డే జట్టు.. మొదటి ఐదుగురిలో ముగ్గరు మనోళ్లే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

