Lionel Messi | ఫ్రీ-కిక్ గోల్‌తో మెస్సీ సంచలనం.. ఇంగ్లండ్ లెజెండ్ రికార్డు సమం
Lionel Messi : వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi) మరో రికార్డుకు చేరువయ్యాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(World Cup 2026 Qualifiers)లో ఈక్వెడార్‌పై ఫ్రీ-కిక్‌ను గోల్‌గా మలిచాడు. మెస్సీ కెరీర్లో ఇది 65వ ఫ్రీ-కిక్ గోల్. దాంతో ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్(David Beckham) రికార్డు...
Lionel Messi : వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi) మరో రికార్డుకు చేరువయ్యాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(World Cup 2026 Qualifiers)లో ఈక్వెడార్‌పై ఫ్రీ-కిక్‌ను గోల్‌గా మలిచాడు. మెస్సీ కెరీర్లో ఇది 65వ ఫ్రీ-కిక్ గోల్. దాంతో ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్(David Beckham) రికార్డు సమం చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో ఫుట్‌బాలర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు.
ఫ్రీ కిక్‌తో అత్యధిక గోల్స్ సాధించింది ఎవరో తెలుసా… రొనాల్డిన్హో(Ronaldinho). బ్రెజిల్‌కు చెందిన ఈ స్టార్ ఆటగాడు 66 ఫ్రీ-కిక్ గోల్స్ కొట్టాడు. ఈ జాజితాలో విక్టర్ రెగ్రోటగిలే(భictor regrotagile), ఫుట్‌బాల్ లెజెండ్ పీలే(Pele), బ్రెజిల్ మాజీ ఫుట్‌బాలర్ జునిన్హో(Juninho)లు మెస్సీ కంటే ముందున్నారు. కెరీర్లో ఇప్పటివరకూ 1040 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 819 గోల్స్ కొట్టాడు. మరో 361 గోల్స్‌కు సహాయం అందించాడు.
— cabjedits (@bocavideos2022) September 8, 2023
డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా(Arjentina) 2026 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ (World Cup 2026 Qualifiers)లో బోణీ కొట్టింది. కెప్టెన్ మెస్సీ సూపర్ గోల్‌తో ఈక్వెడార్(Ecuador)పై అద్భుత విజయం సాధించింది. ఇంటర్ మియామి తరఫున ఇరగదీసిన మెస్సీ అదే జోరు కొనసాగించాడు. ఈ స్టార్ ఫుట్‌బాలర్ రెండో అర్థ భాగంలో గోల్ చేయడంతో 1-0తో విక్టరీ కొట్టింది.
ఈక్వెడార్‌పై గోల్ చేసిన మెస్సీ

నిరుడు అర్జెంటీనాకు ప్రపంచ కప్ అందించిన మెస్సీ ఈమధ్యే అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు మారాడు. ఈ క్లబ్‌కు డేవిడ్ బెక్‌హమ్ సహ యజమానిగా ఉండడం విశేషం. మేజర్ సాకర్ లీగ్‌లో దుమ్మురేపిన మెస్సీ 11 మ్యాచుల్లో 11 గోల్స్ సాధించాడు. మరో 5 గోల్స్‌కు సహాయం అందించాడు.
ఇవి కూడా చదవండి
Saina Nehwal | మహాకాళేశ్వర్ టెంపుల్లో సైనా నెహ్వాల్ ప్రత్యేక పూజలు
Shikhar Dhawan | ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో శిఖర్ ధావన్ పూజలు.. భారత్ ప్రపంచకప్ గెలవాలంటూ ప్రార్థనలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

