Hasan Ali | పాక్ పేసర్ డాన్స్‌ను కాపీ కొట్టిన అభిమానులు.. వీడియో
Hasan Ali : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో పాకిస్థాన్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే కుప్పకూలినా.. అనంతరం కంగారూ బ్యాటింగ్ లైనప్‌ను పాక్ పేసర్లు కకావికలం చేశారు. మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ హసన్ అలీ(Hasan Ali) అభిమానులను...
Hasan Ali : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో పాకిస్థాన్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే కుప్పకూలినా.. అనంతరం కంగారూ బ్యాటింగ్ లైనప్‌ను పాక్ పేసర్లు కకావికలం చేశారు. స్పీడ్‌స్టర్ ఆఫ్రిది, మిర్ హంజా దెబ్బకు ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది. అయితే.. మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ హసన్ అలీ(Hasan Ali) అభిమానులను మస్త్ ఎంటర్టైన్ చేశాడు.
బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అలీ స్ట్రెచింగ్, డాన్స్ స్టెప్పులతో వాళ్లను ఉత్సాహపరిచాడు. ఇంకేముంది.. అలీని ఫాలో అయిన ఫ్యాన్స్ అతడి మాదిరిగానే స్టాండ్స్‌లో డాన్స్ చేశారు. అలీతో పాటు అభిమానులు స్టెప్పులు వేయడం కెమెరాలో రికార్డయింది. అంతేకాదు మ్యాచ్ సమయంలో అలీ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశాడు. ఒక అభిమాని నుదుటిపై ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫొటో ఆన్లైన్లో వైరల్ అయింది.
Get your body moving with Hasan Ali! #AUSvPAK pic.twitter.com/8Y0ltpInXx
— cricket.com.au (@cricketcomau) December 28, 2023
తొలి టెస్టులో భారీ తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా బాక్సిండ్ టెస్ట్‌లో పట్టుబిగిస్తోంది. మూడో రోజు తొలి సెషన్లోనూ పాక్‌ను చుట్టేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడినా తొలి టెస్టు హీరో మిచెల్ మార్ష్(95), స్టీవ్ స్మిత్(50) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో కోలుకుంది. రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

ఫామ్‌లో ఉన్న స్మిత్ ఆట ముగుస్తుందనగా ఆఖరి బంతికి షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొత్తంగా ఈ టెస్టులో కంగారూ జట్టు 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే.. నాలుగో రోజు తొలి సెషన్లో పాక్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ టెయిలెంటర్లు ఎన్ని పరుగులు చేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి
- Boxing Day Test | సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా
- KTR | పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేటీఆర్
- Bus Fire | 13 మందిని బలిగొన్న బస్సు యజమాని బీజేపీ నేత.. పత్రాల గడువు ముగిసినట్లు గుర్తింపు
- Accident | తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కర్ణాటక భక్తులకు స్వల్పగాయాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

