మనమ : ఫార్ములా వన్ సీజన్ తొలి రేస్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రి రేస్‌ను మాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో వెర్స్టాపెన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను వరుసగా మూడోసారి గెలుచుకునే అవకాశాలు మెరుగుపరచుకున్నాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. సీజన్ తొలి రేస్‌ను గెలుచుకోవడం వెర్స్టాపెన్కిదే తొలిసారి. కాగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుచుకున్న ఫెర్నాండొ అలాన్సొ మూడో స్థానంలో నిలిచి పోడియం ఫినిష్ పూరించాడు.