క్రికెట్ మ్యాచ్‌లో క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫీల్డర్‌ను బ్యాటర్ పక్కకు తోసేశాడు. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్ ఛేజింగ్ సమయంలో 17వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న మాథ్యూ వేడ్.. మార్క్ వుడ్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. ఈ సమయంలో రన్ తీసేందుకు ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నో చెప్పాడు. దాంతో వెనక్కు తిరిగిన వేడ్.. క్యాచ్ అందుకునేందుకు ముందుకొచ్చిన వుడ్‌ను కావాలని అడ్డుకొని, వెనక్కు నెట్టేశాడు. దాంతో క్యాచ్ మిస్సయింది.
వుడ్ ఆశ్చర్యపోయి అంపైర్ వైపు చూశాడు. అయితే దీనిపై ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ అప్పీల్ చేయకపోవడంతో వేడ్ బతికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా ఛండాలంగా ఆడిన వేడ్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు.
The CEO of Sportsman Spirit, M Wade, stopping M Wood from catching the ball!!
The OZs@azkhawaja1 pic.twitter.com/zAsJl6gpqz— WaQas Ahmad (@waqasaAhmad8) October 9, 2022