కోల్‌కతా: క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన భారత సీనియర్ ప్లేయర్, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్‌కు రంజీ ట్రోఫీ అందించాలని ఉందని.. దీని కోసం మరోసారి ప్రయత్నించాలనుకుంటున్నట్లు మనోజ్ వెల్లడించాడు.
ఈ నెల 3న ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన 37 ఏండ్ల మనోజ్ తివారి.. ఒక్క ఏడాది కోసం తిరిగి రావాలనుకుంటున్నట్లు మంగళవారం పేర్కొన్నాడు.