దోహా: ప్రతిష్టాత్మక టేబుల్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత సింగిల్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో మనిక బాత్రా, దివ్యతో పాటు పురుషుల సింగిల్స్‌లో మానవ్ టక్కర్ రెండో రౌండ్‌కే వెనుదిరిగారు. 48వ ర్యాంకర్ మానవ్ 2-4 (11-13, 3-11, 11-9, 6-11, 11-9, 3-11)తో హరిమొటొ తొమొకజు (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు.
మ్యాచ్ ఓడినా మానవ్ పోరాటం ఆకట్టుకుంది. కానీ మనిక 0-4 (8-11, 7-11, 5-11, 8-11)తో జి.హెచ్. పార్క్ (దక్షిణ కొరియా) చేతిలో కనీసం పోరాటం లేకుండానే నిష్క్రమించింది. మరో పోరులో దివ్య 1-4 (3-7, 7-11, 6-11, 11-6, 5-11)తో చైనీస్ తైపీ అమ్మాయి చెన్ ఐ చింగ్‌కు తలవంచింది.