Smriti Mandhana : భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana )కు అరుదైన గౌరవం లభించింది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ‘టైమ్స్’ మ్యాగజైన్ 100 మంది ‘అత్యంత ప్రభావశీలుర జాబితా’లో చోటు దక్కింది. క్రీడా విభాగంలో ఎందరో స్టార్లు ఉన్నప్పటికీ భారత్ నుంచి మంధాన మాత్రమే ఎంపికవ్వడం విశేషం. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, టెన్నిస్ స్టార్ అల్కరాస్ ఈ జాబితాలో ఉన్నారు.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అర్ధ శతకంతో చెలరేగిన టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో ఘనత సాధించింది. తన సొగసైన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మంధాన.. ఈసారి టైమ్స్ మ్యాగజీన్ 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో నిలిచింది. విధ్వంసక బ్యాటింగ్‌తో వ్యక్తిగత మైలురాళ్లను అందుకోవడమే కాకుండా భారత జట్టు విజయాల్లో కీలకమవుతున్నందున మంధానను ఎంపిక చేశామని టైమ్స్ మ్యాగజీన్ పేర్కొంది. అంతేకాదు ‘రికార్డులు మంధానకు దాసోహం అవుతున్నా’యని తమ ప్రొఫైల్‌లో పోస్ట్ పెట్టింది.
STORY | Smriti Mandhana only Indian among TIME magazine’s 100 most influential sportspersons
Cricketer Smriti Mandhana has been named by TIME magazine among this year’s 100 most influential people in sports, the only Indian to be featured on the list.
TIME’s list of the 100… pic.twitter.com/rQE5KIQFXe
— Press Trust of India (@PTI_News) June 16, 2026
అంతర్జాతీయ క్రికెట్లో మంధాన రికార్డుల మోత మోగించింది. దేశవాళీ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో రికార్డు నెలకొల్పిన ఈ ఓపెనర్.. మూడు ఫార్మాట్లలో శతకం సాధించిన మొదటి భారతీయురాలిగా నిలిచింది. అంతేనా.. ఒకే ఏడాదిలో వన్డేల్లో వెయ్యికి పైగా రన్స్ కొట్టిన తొలి మహిళా క్రికెటర్ తనే. 2024 నుంచి నిలకడగా రాణిస్తున్న మంధానకు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు దక్కింది.
Indian cricketer Smriti Mandhana has been featured in TIME’s 100 Most Influential People in Sports 2026, becoming the only Indian athlete to make this year’s prestigious list. pic.twitter.com/8y7a2jZuBU
— India Blueprint (@indiablueprint) June 16, 2026
అంతర్జాతీయంగానే కాదు ఫ్రాంచైజీ క్రికెట్లోనూ దుమ్మురేపింది మంధాన. మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రెండు ట్రోఫీలు కట్టబెట్టింది. మంధాన సారథ్యంలో ఆర్సీబీ 2024, 2026లో ఛాంపియన్‌గా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో 2026 సంవత్సరంలో అథ్లెట్స్, కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్స్, పెట్టుపడిదారులు, మార్పును తీసుకొచ్చిన వారితో టైమ్స్ మ్యాగజీన్ ఒక జాబితా సిద్ధం చేసింది. అందులో ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాస్, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటినో వంటి వారున్నారు. భారత్ నుంచి ఈ హోదా అందుకున్న ఏకైక అథ్లెట్ తనే.