SRH vs LSG : సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఇషాన్ మలింగ(1-5) తొలి వికెట్ అందించాడు. ఓపెనర్మిచెల్ మార్ష్(14)ను పెవిలియన్ పంపి లక్నో సూపర్ జెయింట్స్‌కు షాకిచ్చాడీ స్పీడ్‌స్టర్. బౌండరీ రాబట్టిన మార్ష్ అదే ఊపులో డీప్ స్క్వేర్ దిశలో పెద్ద షాట్ ఆడాడు. కానీ, అక్కడే కాచుకొని ఉన్న నితీశ్ రెడ్డికి నేరుగా క్యాచ్ విచ్చి వెనుదిరిగాడు. దాంతో.. 37 వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ను 156కే కట్టడి చేసిన లక్నో సూజర్ జెయింట్స్ ఛేదనను దూకుడుగా ఆరంభించింది.షర్ష్ దూబే వేఇసన తొలి ఓవర్లో రెండే రన్స్ రావడంతో నితీశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు ఓపెనర్లు. ఎడెన్ మర్క్రమ్(37 నాటౌట్) వరుసగా రెండు ఫోర్లు బాదగా.. మిచెల్ మార్ష్ ఓ బౌండరీ సాధించాడు.
Eshan Malinga with the first wicket for @sunrisers ☝️
Aiden Markram going strong for the visitors 💪#LSG 53/1 in 6⃣ overs
Updates ▶️ https://t.co/qC2rF1Hiiz#TATAIPL | #KhelBindaas | #SRHvLSG pic.twitter.com/6poUDSto3x
— IndianPremierLeague (@IPL) April 5, 2026
ధాటిగా ఆడుతున్న మార్ష్‌ను షాన్ మలింగ బోల్తా కొట్టించగా 37 వద్ద లక్నో తొలి వికెట్ పడింది. ఉనాద్కాట్ ఓవర్లో మర్క్రమ్ ఫోర్, సిక్సర్ సాధించగా పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. రిషభ్ పంత్ 2 పరుగులతో ఆడుతున్నాడు.