Luka Modric | అవన్నీ వదంతులే.. రియల్ మాడ్రిడ్‌తోనే కొనసాగుతా : క్రొయేషియా కెప్టెన్
క్రొయేషియా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ లుకా మోడ్రిక్ వదంతులకు తెరదించాడు. తాను రియల్ మాడ్రిడ్ (Real Madrid) క్లబ్తోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ ( Al Nassr) క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకునే ఆలోచనే తనకు లేదుని తేల్చి చెప్పాడు.
Luka Modric : క్రొయేషియా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ లుకా మోడ్రిక్ వదంతులకు తెరదించాడు. తాను రియల్ మాడ్రిడ్ (Real Madrid) క్లబ్తోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ ( Al Nassr) క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకునే ఆలోచనే తనకు లేదుని తేల్చి చెప్పాడు. ‘నేను ఏం అనుకుంటున్నాను అనేది మీ అందరికీ తెలిసిందే. రియల్ మాడ్రిడ్‌తోనే కొనసాగాలని భావిస్తున్నా. నేను అనుకున్నదే జరగుతుందని నమ్ముతున్నా. అల్ నస్రీ క్లబ్‌తో ఒప్పందం అనేవన్న కట్టు కథలు.
ఇదే విషయం నేను వందోసారి చెప్తున్నా. వచ్చే సీజన్లో కూడా రియల్ మాడ్రిడ్‌కే ఆడతానని నమ్మకంతో ఉన్నా’ అని మోడ్రిక్ తెలిపాడు. అల్ నస్రీ క్లబ్ ఈ ఏడాది జనవరిలో క్రిస్టియానో రొనాల్డోతో భారీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోర్చుగల్ స్టార్ ఆటగాడిని రూ. 440 కోట్లకు అల్ నస్రీ సొంతం చేసుకుంది.
క్లబ్ తరఫున 37 గోల్స్
మోడ్రిక్ 2012 నుంచి రియల్ మాడ్రిడ్‌కు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆ క్లబ్ తరఫున 473 మ్యాచ్‌లు ఆడిన అతను 37 గోల్స్ కొట్టాడు. సహచరులు 76 గోల్స్ చేయడంలో సాయం చేశాడు. ఈ ఏడాది ఆఖర్లో రియల్ మాడ్రిడ్‌తో మోడ్రిక్ ఒప్పందం ముగియనుంది. దాంతో, అతను అల్ నస్రీ క్లబ్‌కు వెళ్తాడనే వార్తలు సోషల్‌మీడియాలో ఊపందుకున్నాయి. మిడ్ ఫీల్డర్‌గా రాటుదేలిన మోడ్రిక్ గత ఏడాది ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించాడు. తన మార్క్ కెప్టెన్సీతో క్రొయేషియాను సెమీస్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్ చేరాలనుకున్న ఆ జట్టు ఆశలపై లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా నీళ్లు చల్లింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 3-0తో క్రొయేషియాను ఓడించింది.
ఇవి కూడా చదవండి
IPL 2023 | టెన్నిస్ రాకెట్‌తో గుజరాత్ టైటన్స్ ప్రాక్టీస్.. వీడియో చూశారా..?
Afghanistan | టీ20ల్లో పాకిస్థాన్‌కు షాకిచ్చిన అఫ్గానిస్థాన్.. తొలి మ్యాచ్ గెలిచిన రషీద్ సేన
IPL 2023 | సీఎస్కే ప్రాక్టీస్ సెషన్లో దుమ్మురేపిన బెన్ స్టోక్స్.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

