IPL | పోటీలోకి వచ్చిన లక్నో.. పంజాబ్‌పై అద్భుత విజయం
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ పోటీలోకి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. లక్నో నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 5 వికెట్లకు 178 పరుగులు చేసింది.
- రాణించిన మయాంక్, కృనాల్, పూరన్
- ధవన్, బెయిర్‌స్టో పోరాటం వృథా
- చేజేతులా ఓడిన కింగ్స్
- లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్జే) అదరగొట్టింది.
రాజస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి త్వరగానే తేరుకున్న లక్నో..మలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది. సొంత ఇలాఖాలో సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ లీగ్‌లో పాయింట్ల ఖాతా తెరిచింది. డికాక్ అర్ధసెంచరీకి తోడు కృనాల్ పాండ్యా, పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో పోరాడే స్కోరు అందుకున్న లక్నో..పంజాబ్‌ను కట్టడి చేయడంలో సఫలమైంది. ధవన్, బెయిర్‌స్టో అదిరిపోయే ఆరంభాన్నిచ్చినా..తమకు అనుకూలంగా మలుచుకోలేకపోయింది. మయాంక్ ధాటికివరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి.. చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది.
IPL | లక్నో: ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ పోటీలోకి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. లక్నో నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్లు ధవన్ (70), బెయిర్‌స్టో(42) రాణించారు. అరంగేట్రం మ్యాచ్ ఆడిన మయాంక్ యాదవ్ (3/27) మూడు వికెట్లు పడగొట్టగా, మోసిన్‌ఖాన్ (2/34) రెండు వికెట్లు తీశాడు. తొలుత డికాక్(54), కృనాల్పాండ్యా(22 బంతుల్లో 43 నాటౌట్, 4ఫోర్లు, 2 సిక్స్‌లు), పూరన్(21 బంతుల్లో 42, 3ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ముఖ్యంగా ఆఖర్లో కృనాల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో లక్నో భారీ స్కోరు అందుకుంది. కరాన్ (3/28), అర్ష్‌దీప్‌సింగ్ (2/30) ఆకట్టుకున్నారు. మయాంక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’దక్కింది.
ధవన్, బెయిర్‌స్టో రాణించినా:
లక్నో నిర్దేశించిన లక్ష్యఛేదనలో పంజాబ్‌కు ఓపెనర్లు ధవన్, బెయిర్‌స్టో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు బౌండరీలతో విజృంభించారు. ముఖ్యంగా ధవన్ స్వేచ్చగా షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. అయితే ప్రభ్‌సిమ్రన్(19), జితేశ్శర్మ(6), కరాన్(0) నిరాశపర్చడం పంజాబ్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు వేగంతో మయాంక్ యాదవ్..పంజాబ్ పతనాన్ని శాసించాడు. కండ్లు చెదిరే వేగంతో పంజాబ్ వికెట్లను నేలకూల్చాడు.
పూరన్, కృనాల్ మెరుపులు:
ఓపెనర్లు డికాక్, రాహుల్ ఆశించినంత మెరుగైన శుభారంభం అందించలేకపోయారు. ఓ ఎండ్‌లో డికాక్ ఫోర్‌తో తన పరుగుల ఖాతా తెరిస్తే..రాహుల్ సింగిల్‌తో మొదలుపెట్టాడు. రాహుల్..బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ పూరన్..చాహర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ రెండు భారీ సిక్స్‌లు, ఫోర్‌తో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వరుస బౌండరీలతో డికాక్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆఖర్లో కృనాల్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్నో భారీ స్కోరు అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 199/8(డికాక్ 54, కృనాల్ 43 నాటౌట్, పూరన్ 42, కరన్ 3/28, అర్ష్‌దీప్‌సింగ్ 2/30), పంజాబ్: 20 ఓవర్లలో 178/5(ధవన్ 70, బెయిర్‌స్టో 42, మయాంక్ 3/27, మోసిన్2/34)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Dickock
- ipl
- Krunal
- Krunal Pooran
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

