IPL | లక్నో సూపర్.. ముంబై పై ఉత్కంఠ విజయం
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. ఫైనల్-4లో నిలువాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లన్నీ అద్భుత పోరాట పటిమ కనబరుస్తున్నాయి. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో లక్నో సూపర్‌జెయింట్స్ అదరగొట్టింది.
- ప్లేఆఫ్స్ రేసులో జెయింట్స్ ముందంజ
- రాణించిన స్టొయినిస్,మోసిన్
IPL | ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. ఫైనల్-4లో నిలువాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లన్నీ అద్భుత పోరాట పటిమ కనబరుస్తున్నాయి. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో లక్నో సూపర్‌జెయింట్స్ అదరగొట్టింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుదికంటా పోరాడి మ్యాచ్‌ను తన వశం చేసుకుంది. స్టొయినిస్, కృనాల్ బ్యాటింగ్‌తో పోరాడే స్కోరు అందుకున్న లక్నో..ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లింది. మోసిన్‌ఖాన్ సూపర్ బౌలింగ్‌తో లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
లక్నో: గెలుపు దోబూచులాడిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్జెయింట్స్దే పైచేయి అయ్యింది. ఆఖరి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌లో లక్నో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో 5 పరుగుల తేడాతో ముంబైని మట్టికరిపించింది. దీంతో 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో లక్నో 15 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకితే.. ముంబై(14) నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ విషయానికొస్తే..లక్నో నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 172/5 స్కోరుకు పరిమితమైంది. లక్ష్యఛేదనలో ఇషాన్ కిషన్(59) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా..కెప్టెన్ రోహిత్‌శర్మ(37), సూర్యకుమార్‌యాదవ్(7), నేహాల్ వదెరా(16)నిరాశపరిచారు.
ఆఖర్లో జట్టును గెలిపించేందుకు టిమ్ డేవిడ్(32 నాటౌట్) ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో మోసిన్‌ఖాన్ ఐదు పరుగులే ఇచ్చి లక్నోకు అదిరిపోయే విజయాన్ని కట్టబెట్టాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న హార్డ్‌హిట్టర్లు డేవిడ్, గ్రీన్‌ను మోసిన్ తనదైన బౌలింగ్‌తో కట్టడి చేశాడు. యశ్ ఠాకూర్(2/40), రవి బిష్ణోయ్(2/26) రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు స్టొయినిస్(47 బంతుల్లో 89 నాటౌట్, 4ఫోర్లు, 8సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ కృనాల్ పాండ్యా(49, రిటైర్డ్ హర్ట్) రాణించాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా, వీరిద్దరు సమయోచిత ఇన్నింగ్స్‌తో పోరాడే స్కోరు అందించారు. స్టొయినిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 177/3(స్టొయినిస్ 89 నాటౌట్, కృనాల్ పాండ్యా 49 రిటైర్డ్‌హర్ట్, బెహెన్‌డార్ఫ్ 2/30, చావ్లా 1/26),
ముంబై: 20 ఓవర్లలో 172/5(కిషన్ 59, రోహిత్‌శర్మ 37, బిష్ణోయ్ 2/26, ఠాకూర్ 2/40)

01
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

