IPL 2023 | లక్నో, చెన్నై ఫ్రాంఛైజీలకు షాక్.. ఆ ఇద్దరు పేసర్లు ఆడేది అనుమానమే!
పదహారో సీజన్ ఐపీఎల్(IPL)కు ముందు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫ్రాంఛైజీలకు షాక్. లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్, చెన్నై ఫాస్ట్ బౌలర్ ముకేశ్ చౌదరీ ఈ సీజన్లో ఆడేది అనుమానమే అని సమచారం. గాయంతో బాధపడుతున్న వీళ్లిద్దరూ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం వీళ్లు రిహాబిలిటేషన్‌లో ఉన్నారు.
IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్(IPL)కు ముందు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫ్రాంఛైజీలకు షాక్. లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్, చెన్నై ఫాస్ట్ బౌలర్ ముకేశ్ చౌదరీ ఈ సీజన్లో ఆడేది అనుమానమే అని సమచారం. గాయంతో బాధపడుతున్న వీళ్లిద్దరూ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం వీళ్లు రిహాబిలిటేషన్‌లో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ 2023కు వారం రోజులే ఉంది. ఆలోపు వీళ్లు ఫిట్నెస్ సాధిస్తారా? లేదా? అని లక్నో, చెన్నై జట్లు ఆందోళనతో ఉన్నాయి.
‘ముకేశ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. కానీ, మాకు అతను కోలుకుంటాడనే నమ్మకం లేదు. గత సీజన్లో అతను మా బౌలింగ్ దళంలో కీలక సభ్యుడు. ఒకవేళ ఈసీజన్లో అతను ఆడకుంటే అది మా దురదృష్టం’ అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపాడు. ముకేశ్ 13 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. మొహ్సిన్ 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు.
ఆరంభ పోరు వీళ్ల మధ్యే..
ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న అట్టహాసంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగు సార్లు ట్రోఫీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. కరోనా కారణంగా గత రెండు సీజన్లను యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి సొంతగడ్డపై జరగనున్న ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టాస్ తర్వాత తుది జట్టును ఎంచుకోవడం, ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను ఆడించడం వంటివి ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు. అంతేకాదు ప్రతి టీమ్ సొంతగ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది.
ఇవి కూడా చదవండి
Ricky Ponting | ఈ సీజన్లో మైదానంలోకి దిగకున్నా.. జట్టుతోనే పంత్ : రికీ పాంటింగ్
IPL 2023 | ఒకప్పుడు చెంప దెబ్బ వివాదంతో వార్తల్లో.. ఇప్పుడు కామెంటరీ ప్యానెల్లో జంటగా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

