లక్నోను హాజిల్‌వుడ్ మరో దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే స్టార్ ఓపెనర్ డీకాక్ (3)ను పెవిలియన్ చేర్చిన హాజిల్‌వుడ్.. ఆ తర్వాత ఐదో ఓవర్లో మరోసారి సత్తా చాటాడు. ఫామ్‌లో ఉన్న మనీష్ పాండే (6)ను అవుట్ చేశాడు. అతను వేసిన షార్ట్‌బాల్‌ను పుల్ చేసేందుకు మనీష్ ప్రయత్నించాడు.
అయితే టైమింగ్ మిస్ అవడంతో బ్యాటు పైభాగంలో తగిలిన బంతి గాల్లోకి లేచింది. షార్ట్ మిడ్వికెట్లో ఉన్న హర్షల్ పటేల్ సులభంగా క్యాచ్ అందుకోవడంతో మనీష్ పాండే వెనుతిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో జట్టు రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య ఉన్నారు.