ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కష్టాలు పడుతోంది. ఒక పక్క కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో ఆకట్టుకున్నా.. మరో ఎండ్‌లో అతనికి సహకారం కరువైంది. డానియల్ శామ్స్ వేసిన ఓవర్లో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ (0) డకౌట్ అవగా..
ఆ తర్వాతి ఓవర్లో పొలార్డ్ వేసిన తొలి బంతికే కృనాల్ పాండ్యా (0) గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల్లో పడింది. ఇలాంటి తరుణంలో కెప్టెన్‌కు అండగా నిలిచేందుకు దీపక్ హుడా క్రీజులోకి వచ్చాడు.