గుజరాత్ టైటన్స్ కూడా లక్నో తరహాలోనే ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తొలి బంతికి లెగ్ బై ఫోర్ అందుకున్న గుజరాత్ జట్టు.. మూడో బంతికే వికెట్ కోల్పోయింది. 159 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన గుజరాత్‌ను పేసర్ దుష్మంత చమీర ఆరంభంలోనే దెబ్బ కొట్టాడు. అతనువ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని బాదడానికి ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్ (0) మిస్ అయ్యాడు.
బ్యాటు చివర్లో తగిలిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న దీపక్ హుడా జాగ్రత్తగా అందుకోవడంతో గిల్ పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు లక్నో ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరితే.. గిల్ డకౌట్‌గా వెనుతిరగడం గమనార్హం.