CSK vs LSG : ఐపీఎల్ 17వ సీజన్ 39వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికైన ఈ పోరులో లక్నో సారథి కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. చెన్నైని బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
లక్నో తుది జట్టు : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుశ్ బదొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
చెన్నై తుది జట్టు : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మోయిన్ అలీ, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మథీశ పథిరన.
గత మ్యాచ్లో లక్నో చేతిలో ఓడిన సీఎస్కే ఇప్పుడు ప్రతీకార విజయంపై కన్నేసింది. ప్రస్తుతం రెండు జట్లు తలా నాలుగు విజయాలతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ ఈ మ్యాచ్ లక్నో, సీఎస్కేలకు కీలకం కానుంది.