Newzealand | బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. కివీస్ కొత్త కెప్టెన్‌గా ఫెర్గూసన్
Newzealand : ఇంగ్లండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్(Newzealand) మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే బంగ్లాదేశ్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దాంతో, న్యూజిలాండ్ క్రికెట్ ఈ రోజు 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలిమయ్సన్(Kane Williamson), వైస్ కెప్టెన్..
Newzealand : ఇంగ్లండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్(Newzealand) మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే బంగ్లాదేశ్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దాంతో, న్యూజిలాండ్ క్రికెట్ ఈ రోజు 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలిమయ్సన్(Kane Williamson), వైస్ కెప్టెన్ టామ్ లాథమ్(Tom Latham) అందుబాటులో లేకపోవడంతో లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson)కు సారథిగా బాధ్యతలు అప్పగించింది. అయితే.. వరల్డ్ కప్ బృందంలోలేని చాలామంది ఆటగాళ్లను సెలెక్టర్లు ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. సెప్టెంబర్ 21న కివీస్, బంగ్లాదేశ్ తొలి వన్డే ఆడనున్నాయి.
న్యూజిలాండ్ స్క్వాడ్ : లాకీ ఫెర్గూసన్(కెప్టెన్), ఫిన్ అలెన్, టామ్ బండిల్, ట్రెంట్ బౌల్ట్, చాడ్ బోవ్స్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైలీ జేమిసన్, కోల్ మెక్కాంచీ, ఆడం మిల్నే, హెన్రీ నికోలస్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
నాలుగేళ్ల క్రితం ప్రపంచ కప్(ODI World Cup 2019) ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ అనూహ్యంగా టైటిల్ చేజార్చుకుంది. బెన్ స్టోక్స్(Ben Stokes), జోఫ్రా ఆర్చర్(Jofra Archer) అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ కప్పు ఎగరేసుకపోయింది. దాంతో, కివీస్ ఈసారి ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే.. కెప్టెన్ విలియమ్సన్ ఇంకా ఫామ్ చాటుకోలేదు.
టిమ్ సౌథీ, విలియమ్సన్

స్టార్ పేసర్ టిమ్ సౌథీ(Tim Southee) నిన్న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కుడి బొటన వేలు విరగ్గొట్టుకున్నాడు. కెరీర్లో నాలుగో ప్రపంచ కప్ ఆడుతున్న ఈ ఇద్దరూ న్యూజిలాండ్‌కు ఎంతో కీలకం కానున్నారు. అక్టోబర్ 5న భారత గడ్డపై వరల్డ్ కప్ షరూ కానుంది. ఆరంభ పోరులో కివీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
Moin Khan | పాకిస్థాన్ జట్టులో ఐక్యత లేదు.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Neymar Jr | సౌదీ ప్రో లీగ్‌లో తొలి అడుగు.. అల్ హిలాల్ క్లబ్‌ను గెలిపించిన నెయ్మర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

