Neymar Jr | సౌదీ ప్రో లీగ్‌లో తొలి అడుగు.. అల్ హిలాల్ క్లబ్‌ను గెలిపించిన నెయ్మర్
Neymar Jr : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్ జూనియర్(Neymar Jr) సౌదీ ప్రో లీగ్‌లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అల్ హిలాల్(Al Hilal) క్లబ్ తరఫున మొదటి గోల్ కొట్టాడు. దాంతో, శుక్రవారం అల్ రియాద్(Al Riyad) జట్టుపై అల్ హిలాల్ 6-1తో భారీ విజయం...
Neymar Jr : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్ జూనియర్(Neymar Jr) సౌదీ ప్రో లీగ్‌లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అల్ హిలాల్(Al Hilal) క్లబ్ తరఫున మొదటి గోల్ కొట్టాడు. దాంతో, శుక్రవారం అల్ రియాద్(Al Riyad) జట్టుపై అల్ హిలాల్ 6-1తో భారీ విజయం నమోదు చేసింది. ఈ మిడ్‌ఫీల్డర్ రెండో అర్థ భాగంలో మైదానంలోకి దిగాడు. 87వ నిమిషంలో గోల్ కొట్టాడు. దాంతో, అల్ హిలాల్ క్లబ్ భారీ విక్టరీ సొంతం చేసుకుంది.
అల్ హిలాల్ ఈ మధ్యే నెయ్‌మర్‌తో భారీ ఒప్పందం చేసుకుంది. రెండేళ్ల కాలానికి అతడికి 90 మిలియన్ల యూరోలు అంటే.. భారతీయ కరెన్సీలో రూ.798 కోట్లు ముట్టజెప్పనుంది. నెయ్మర్ 2017లో పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్‌కు మారాడు. అప్పట్లోనే అతడికి పీఎస్జీ రూ. 2వేల కోట్లు ఇచ్చింది.
ఈమధ్యే స్వదేశంలో ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(World Cup Qualifiers 2026)లో నెయ్మర్ అద్భుతంగా రాణించాడు. బొలీవియాపై నెయ్మర్ రెండు మెరుపు గోల్స్ చేశాడు. దాంతో, బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్‌తో దిగ్గజం పీలే(Pele) రికార్డు బ్రేక్ చేశాడు.
దిగ్గజం పీలే రికార్డు బ్రేక్ చేసిన సంతోషంలో నెయ్మర్

నిరుడు ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup)లో నెయ్మర్ బ్రెజిల్‌కు సారథిగా ఉన్నాడు. అయితే.. అతడి జట్టు సెమీస్‌లోనే వెనుదిరిగింది. క్రోయేషియా(Croatia) చేతిలో 4-2తో ఓడిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక నెయ్మర్ ఏడ్చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

