INDA vs SAA : రెండో అనధికారికి టెస్టులో భారత ‘ఏ’ జట్టు గొప్పగా పుంజుకుంది. టాపార్డర్ విఫలమైనా.. ధ్రువ్ జురెల్(132 నాటౌట్) సూపర్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. సఫారీ పేసర్ టియాన్ వాన్ వురేన్ (4-54) ధాటికి ప్రధాన ఆటగాళ్లను ఔట్ చేసి ఒత్తిడిలో పడేశాడు. కేఎల్ రాహల్(19), కెప్టెన్ రిషభ్ పంత్(24)లు నిరాశపరచగా.. జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్న జురెల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ప్రసిధ్ కృష్ణ(0)ను ఔట్ చేసిన వురేన్ 255 వద్ద భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దాంతో.. త ఆట ముగిసే సరికి ఆలౌట్ ప్రమాదంలో పడిన జట్టును కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన జురెల్ జట్టును ఆలౌటయ్యింది.
దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ సన్నాహక మ్యాచ్‌లో భారత స్టార్లు నిరాశపరిచారు. భారత ఏ జట్టు తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్(19), కెప్టెన్ రిషభ్ పంత్(24)లు సఫారీ ఏ బౌలర్లను ఎదుర్కోలేక స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. తొలి సెషన్ ఆరంభంలోనే ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(0)ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు మొరెకీ. ఆ తర్వాత రాహుల్‌ను వూరేన్ బోల్తా కొట్టించగా.. కుదరుకున్న సాయి సుదర్శన్‌ను సుబ్రయేణ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. 41కే మూడు వికెట్లు పడిన వేళ క్రీజలోకి వచ్చిన పంత్ దూకుడుగా ఆడే క్రమంలో మొరేకి ఓవర్లో ఔటయ్యాడు.
Dhruv Jurel makes the most of every opportunity that comes his way. Should he be a permanent member of India’s Test XI? 🤔
And which position suits him best? Drop your thoughts in the comments! 🗣️
PC: Jiostar#DhruvJurel #INDAvsSAA #Test #Cricket pic.twitter.com/Pvx2brHkp0
— OneCricket (@OneCricketApp) November 6, 2025
సఫారీ బౌలర్ల జోరుతో రెండో సెషన్లోనే కుప్పకూలేలా కనిపించిన టీమిండియాను ధ్రువ్ జురెల్ (132 నాటౌట్) ఆదుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకుపోయిన అతడు సఫారీలను విసిగిస్తూ కుల్దీప్ యాదవ్(20), సిరాజ్(15)తో కీలక రన్స్ జోడించాడు. 89కే ఐదు వికెట్లు పడిన వేళ.. టెయిలెండర్లతో కలిసి స్కోర్ రెండొందలు దాటించాడు. సెంచరీ తర్వాత దూకుడుగా ఆడిన జురెల్ జట్టుకు భారీ స్కోర్ అందించాలుకున్నాడు. అయితే.. కుల్దీప్ రనౌట్ కావడం.. సిరాజ్‌ను సెలే వెనక్కి పంపాడు. చివరి వికెట్ అయిన ప్రసిధ్ కృష్ణను ఔట్ చేసిన వురేన్ భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.