10K Cricketers Club | టెస్ట్ క్రికెట్లో `టన్ను`ల రారాజులు వీరే!
10K Cricketers Club | ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో 10 వేల పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌లో ఆ మైలురాయి దాటిన రెండో క్రికెటర్.
10K Cricketers Club | ఇప్పుడంటే అంతా టీ-20 క్రికెట్ మ్యాచ్‌లపై మనస్సు పారేసుకుంటున్నారు.. కానీ.. గతంలో టెస్ట్ మ్యాచ్‌ల్లో బ్యాట్స్మన్ల వీర విహారంపైనే దృష్టి పెట్టేవారు. సెంచరీలు చేసే క్రికెటర్లపై కన్నేసేవారు. అలా టెస్ట్ క్రికెట్లో సెంచరీలతోపాటు ఓవరాల్‌గా 10 వేల పరుగుల మార్క్‌ను దాటిన బ్యాట్స్మన్లు ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్‌మన్ జో రూట్.. 10 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల క్లబ్లో జత కలిశాడు. టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజే జో రూట్ ఈ మైలురాయి దాటడం అరుదైన విషయమే. జో రూట్ కేవలం 218వ ఇన్నింగ్స్‌లోనే ఈ మార్క్‌ను చేరాడని, అతి ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడని చెబుతున్నారు. 10వేల పరుగుల బ్యాట్స్‌మన్ క్లబ్లో చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లలో జో రూట్ రెండో వ్యక్తి. ఇంతకుముందు అలస్టయిర్ కుక్ ఈ రికార్డు నెలకొల్పాడు. అలస్టయిర్ కుక్ తన 229వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
లార్డ్స్‌లో జరిగిన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కివీస్‌పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందడానికి కారణమయ్యాడు జో రూట్. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలిచి పై చేయి సాధించింది. ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగాల్సి ఉంది.
టెస్ట్ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన బ్యాట్స్మన్లు వీరే..
1. సచిన్ టెండూల్కర్ (టీం ఇండియా) – 15,921
2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13,378
3. జాక్విస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) – 13,289
4. రాహుల్ ద్రావిడ్ (టీం ఇండియా) – 13,288
5. అలస్టయిర్ కుక్ (ఇంగ్లండ్) – 12,472
6. కుమార్ సంగక్కర (శ్రీలకం) – 12,400
7. బ్రియన్ లారా (వెస్టిండీస్) – 11,953
8. శివన్నారాయణ చందర్‌పాల్ (వెస్టిండీస్) – 11,867
9. మహేలా జయవర్దనె ( శ్రీలంక ) – 11,814
10. అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) – 11,174
11. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 10,927
12. సునీల్ గవాస్కర్ (టీం ఇండియా) – 10,122
13. యూనిస్‌ఖాన్ (పాకిస్థాన్) – 10,099
14. జో రూట్ (ఇంగ్లండ్) – 10,015
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Alastair Cook
- Joe Root
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

