Lionel Messi | వరల్డ్ కప్ తర్వాత సొంతగడ్డపై తొలి మ్యాచ్.. 800 గోల్ కొట్టిన మెస్సీ
అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ వరల్డ్ కప్ (FIFA World Cup ) తర్వాత స్వదేశంలో తొలి మ్యాచ్ ఆడాడు. పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఈ లెజెండరీ ప్లేర్ తనమార్క్ ఆటతో ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్లో 800 గోల్ కొట్టాడు.
Lionel Messi : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ వరల్డ్ కప్ (FIFA World Cup ) తర్వాత స్వదేశంలో తొలి మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్జెంటీనా జాతీయ గీతం ప్లే చేయగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఈ లెజెండరీ ప్లేర్ తనమార్క్ ఆటతో ఫ్యాన్స్‌ను అలరించాడు.
ఈ మ్యాచ్‌లో మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్లో 800 గోల్ కొట్టాడు. అతను ఫ్రీ కిక్‌ను గోల్ పోస్టులోకి పంపించగానే స్టేడియం మొత్తం మెస్సీ.. మెస్సీ.. నినాదాలతో మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో పనామాను ఓడించింది. వరల్డ్ కప్ తర్వాత మెస్సీ పీఎస్జీ క్లబ్‌కు ఆడాడు. సౌదీ లీగ్‌లో క్రిస్టియానో రొనాల్డో అల్ నస్రీ క్లబ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సత్తా చాటాడు.
మూడోసారి విశ్వవిజేతగా…
మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ గెలిచింది. ఖతర్‌లో ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై 4-2తో విజయం సాధించింది. దాంతో, మూడోసారి విశ్వ విజేతగా అవతరించింది. 2018లో కూడా అర్జెంటీనా వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. కానీ, జర్మనీ కప్పు ఎగరేసుకుపోయింది. ఆ క్షణం వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలనుకున్న మెస్సీ కల చెదిరింది. అయితే.. ఈసారి మెస్సీ జట్టును ఫైనల్‌కు చేర్చడమే కాకుండా కప్పు కూడా అందించాడు. ఫైనల్లో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ చేసినా కూడా ఫలితం లేకపోయింది.
#ARG 🇦🇷 2 – 🇵🇦 0 #PAN | 43 ST | Leo la soltó y la gente lo gritó, de tanto intentar se hizo realidad.
Mirá el partido EN VIVO en https://t.co/fnEKkuadQ9 #SomosMundiales pic.twitter.com/nPKpl0drjZ
— Televisión Pública (@TV_Publica) March 24, 2023
ఇవి కూడా చదవండి
Swiss Open | స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ
IPL 2023 | లక్నో, చెన్నై ఫ్రాంఛైజీలకు షాక్.. ఆ ఇద్దరు పేసర్లు ఆడేది అనుమానమే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

