గెలుపే లక్ష్యంగా
‘మీ నాన్న హఠాత్తుగా చనిపోయారని సమాచారం వచ్చింది. నువ్వు వెంటనే ఇండియాకు వెళ్లాలి. మిజోరంలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనే ఏర్పాటు చేశాం. తక్షణమే నువ్వు బయలుదేరు’ అని కోచ్ అన్నారు. ఆ మాటలు విన్న భారత మహిళల హాకీ క్రీడాకారిణి లాల్రెమ్సియామి మార్జొటే కుంగిపోలేదు.
‘నేను దేశం కోసం ఆడతాను. ఆడిన తర్వాత వెళ్తాను’ అని బదులిచ్చింది. ఏడేండ్ల క్రితం జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన సెమీ ఫైనల్లో చిలీతో తలపడిన మ్యాచ్‌లో ఇండియా 4-2 స్కోర్‌తో విజయం సాధించింది. ఆ గెలుపులో లాల్రెమ్సియామిది కీలకమైన పాత్ర. ఇప్పుడు అదే జపాన్ గడ్డపై జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత జట్టు గెలుపులో తనదే కీలక భాగస్వామ్యం. ఒక గోల్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పడమే కాదు భారత హాకీ జట్టుకి ఎన్నో ఏండ్లు కలగా మిగిలిన ఒలింపిక్ అర్హతను సాధించిపెట్టింది. ఇంతకన్నా కావాల్సిందేముంది?
ఒట్టి కర్రతో.. బూట్లే లేకుండా..
లాల్రెమ్సియామి మిజోరం రాష్ట్రంలోని కొలాసిబ్ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగింది. కుటుంబంలో, స్నేహితులు తనను ‘సియామి’ అని పిలుస్తారు. ఆ ఊళ్లో పెద్ద మైదానం లేదు. మిజోరంలో మొత్తంలో మూడే హాకీ గ్రౌండ్స్ ఉండేవి. కొన్నిచోట్ల ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోనే ఆడేవాళ్లు. స్కూల్లో చదివే రోజుల్లో లాల్రెమ్సియామి సాధారణ కర్రలతో హాకీ ఆడటం మొదలుపెట్టింది. మట్టిలో కాళ్లకు బూట్లు, సాక్సులు లేకుండా ఆట మొదలుపెట్టింది. పదకొండేండ్ల వయసులో ఉన్నప్పుడు హాకీ నేర్చుకోవడానికి అకాడమీలో చేరతానని తల్లిదండ్రులతో చెప్పింది. వాళ్లకు హాకీ అంటే ఏమిటో అర్థం కాలేదు.
కొండప్రాంతాల్లో హాకీ ఆడేందుకు అవకాశం లేదు. ఆడేవాళ్లు కనిపించరు. కాబట్టి హాకీ నేర్చుకోవడం కోసం థెంజల్ పట్టణంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థలో చేరింది. అది వాళ్ల ఊరుకి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండప్రాంతాల్లో నివసించడం వల్ల ఆ కొండ దిగేసరికే ఆమె అలసిపోయేది. ఆ తర్వాత మైదానాల్లో కష్టం అనుకోకుండా సాధన చేసేది. ఆ కష్టమే ఆమెను ఇండియా అండర్ 18 జట్టుకి ఎంపికయ్యే సామర్థ్యాన్నిచ్చింది. ఏడాదిలోనే సీనియర్స్ జట్టులో స్థానం దక్కించుకుంది. యూత్ ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో ఆడింది. మిజోరం నుంచి మొదటిసారి ఒలింపిక్ ఆడే వ్యక్తిగా గుర్తింపు దక్కించుకుంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఇరవై అరు సంవత్సరాల సియామి ఏ పతకం తెస్తుందో చూద్దాం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

