Lalchand Rajput | దుబాయ్: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ) నూతన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఎంపికయ్యాడు. పాకిస్థాన్‌కు చెందిన ముదాస్సర్ నాజర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించిన యూఏఈ క్రికెట్ బోర్డు రాజ్‌పుత్‌తో మూడేండ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.
యూఏఈ వేదికగా ఈ నెల 28వ తేదీ నుంచి మొదలయ్యే ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2 ట్రై సిరీస్ ద్వారా రాజ్‌పుత్ కొత్త బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ టోర్నీలో ఆతిథ్య యూఏఈ, స్కాట్లాండ్, కెనడా జట్లు బరిలోకి దిగుతున్నాయి.