న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఈ నెల 15నుంచి ఆరంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గొంతు వాపుతో బాధపడుతున్న తాను ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొనడం లేదని నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడు. ఇటీవల జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ టోర్నీ నుంచే తాను గొంతు నొప్పితో బాధపడుతున్నానని, ఇంకా పూర్తిగా కోలుకోనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.