Kumar Sangakkara | టెస్టు క్రికెట్‌కు కొత్త జీవం పోసింది అతనే.. ఇంగ్లండ్ కోచ్‌పై శ్రీలంక లెజెండ్ ప్రశంసలు
Kumar Sangakkara : టెస్టు క్రికెట్లో బాజ్‌బాల్(bazz ball) ఆటతో ఇంగ్లండ్ జట్టు(England Team) కొత్త ఒరవడి సృష్టించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల ఆటలో డ్రా కోసం కాకుండా విజయమే లక్ష్యంగా ఆడుతున్న ఇంగ్లండ్ మిగతా జట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. కళ తప్పుతున్న టెస్టులకు కొత్త జీవం పోసిన ఆ జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum)పై శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(Kumar Sangakkara) ప్రశంసలు కురిపించాడు. సాంప్రదాయ పద్ధతిలో ఆడే...
Kumar Sangakkara : టెస్టు క్రికెట్లో బాజ్‌బాల్(bazz ball) ఆటతో ఇంగ్లండ్ జట్టు(England Team) కొత్త ఒరవడి సృష్టించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల ఆటలో డ్రా కోసం కాకుండా విజయమే లక్ష్యంగా ఆడుతున్న ఇంగ్లండ్ మిగతా జట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. కళ తప్పుతున్న టెస్టులకు కొత్త జీవం పోసిన ఆ జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum)పై శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(Kumar Sangakkara) ప్రశంసలు కురిపించాడు. సాంప్రదాయ పద్ధతిలో ఆడే ఇంగ్లండ్ జట్టుకు దూకుడు నేర్పి, వాళ్ల ఆట తీరును అతను సమూలంగా మార్చేశాడని సంగక్కర అన్నాడు.
‘అప్పటివరకూ వైట్ బాల్ కోచ్‌గా అనుభవం ఉన్న మెక్కల్లమ్.. ఎర్ర బంతితో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. టెస్టులు అంటే సాగతీత ఆట కాదని నిరూపించాలని అనుకున్నాడు. అందుకుని కొత్తరకం బాజ్‌బాల్ ఆటను పరిచయం చేశాడు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్‌ను ఎక్కువ మంది అభిమానులకు దగ్గర చేశాడు’ అని సంగక్కర వెల్లడించాడు.
కుమార సంగక్కర, బ్రెండన్ మెక్కల్లమ్

న్యూజిలాండ్ ఓపెనర్‌గా మెక్కల్లమ్ ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లోనే శతకం బాదిన అతను 2022లో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయానికి ఆ జట్టు టెస్టుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. అలాంటి జట్టును ఒక్క ఏడాదిలోనే మెక్కల్లమ్ మార్చేశాడు. తన స్టయిల్ విధ్వంసక ఆటను జట్టుకు ఒంటబట్టించాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్

స్ట్రోక్ ప్లేతో అలరించే బెన్ స్టోక్స్ కెప్టెన్(Ben Stokes) అయ్యాక అతడి పని మరింత సులువైంది. మెక్‌కల్లమ్‌ను అభిమానులు ముద్దుగా ‘బాజ్’ అని పిలుస్తారు. దాంతో, అతను నేర్పిన ఆటకు ‘బాజ్‌బాల్'(Bazzball) అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. గత ఏడాది నుంచి ఇంగ్లండ్ టెస్టుల్లో అదరగొడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో స్టోక్స్ సేన మూడు టెస్టులు నెగ్గి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టులోనూ సంచలన విజయం సాధించింది.
యాషెస్ సిరీస్‌లోనూ..
ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్(Ashes Series)లోనూ ఇంగ్లండ్ బాజ్‌బాల్ ఆటతో ఆకట్టుకుంటోంది. తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైనప్పటికీ మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకొంది. హ్యారీ బ్రూక్(75) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడడంతో సిరీస్‌లో నిలిచింది.

నాలుగో టెస్టులోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లు బాజ్‌బాల్ పవర్ చూపిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే(189) సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత వచ్చిన మోయిన్ అలీ(54), జో రూట్(84), హ్యారీ బ్రూక్(61), బెన్‌స్టోక్స్(51), జానీ బెయిర్‌స్టో(99) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించారు.
ఇవి కూడా చదవండి
INDW vs BANW | మూడో వన్డే టై.. సూపర్ ఓవర్ ఆడించకుండానే సిరీస్ పంచేశారు
Korea Open 2023 | చిరాగ్ – సాత్విక్ జోడీ అదుర్స్.. తొలిసారి కొరియా ఓపెన్ ఫైనల్లో ప్రవేశం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

