IPL 2026 : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ పోటీ ఆసక్తికరంగా మారిన వేళ కొత్త వాళ్లతో స్క్వాడ్‌ను పటిష్టం చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. గాయంతో టోర్నీకి దూరమైన వారి స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. తాజాగా ఓవర్టన్ ప్లేస్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డియాన్ ఫొరెస్టర్ను తీసుకున్న చెన్నై.. పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో కుల్దీప్ యాదవ్ (Kuldip Yadav)తో ఒప్పందం కుదుర్చుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సైతం తమ స్క్వాడ్‌లోకి ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్(Richard Gleeson)కు చోటిచ్చింది.
లీగ్ దశ ఆఖర్లో పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు గట్టి పోటీదారుగా మారిన చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లోకి కొత్త పేసర్‌ను తీసుకుంది. సీజన్ ఆరంభం మ్యాచ్‌ల్లోనే గాయపడిన సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంది సీఎస్కే. రూ.30 లక్షలకు కుల్దీప్తో ఒప్పందం కుదిరినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Official Announcement
Kuldip Yadav is Yellove!
A new warrior joins the pride! 💛🦁Note: Kuldip Yadav replaces Khaleel Ahmed, who was ruled out due to injury.#WhistlePodu pic.twitter.com/XCe6esUKKe
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2026
గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన కుల్దీప్ ఇప్పుడు పసుపు జెర్సీతో చెలరేగాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పేసర్ జేమీ ఓవర్టన్ స్థానంలో ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన దక్షిణాఫ్రికా కుర్రాడు డియాన్ ఫొరెస్టర్ (Dian Forrester)ను స్వాడ్లోకి చేర్చుకున్న విషయం తెలిసిందే.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో దుమ్మురేపుతున్న ఆర్సీబీ సైతం స్క్వాడ్‌లోకి కొత్త పేసర్‌ను తీసుకుంది. ఫిట్నెస్ టెస్టులో విఫలమైన శ్రీలంక స్పీడ్‌స్టర్ నువాన్ తుషార స్థానంలో రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్)ను ఎంపిక చేసింది. ఈ పొడగరి పేసర్‌కు బెంగళూరు యాజమాన్యం రూ.1.6 కోట్లు చెల్లించనుంది.
🚨 𝗥𝗶𝗰𝗵𝗮𝗿𝗱 𝗚𝗹𝗲𝗲𝘀𝗼𝗻 𝗶𝗻 𝗥𝗲𝗱, 𝗕𝗹𝘂𝗲, 𝗮𝗻𝗱 𝗚𝗼𝗹𝗱 🚨
The English Speedster joins the Royal Challengers Bengaluru for the remainder of the #TATAIPL 2️⃣0️⃣2️⃣6️⃣ season, replacing Nuwan Thushara. ⚡❤️
Welcome, Richard! Time to wear the badge and #PlayBold. ❤️🔥 pic.twitter.com/VMmrNOm8mL
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 15, 2026
2022లో అరంగేట్రం చేసిన గ్లీసన్‌కు అంతర్జాతీయంగా ఆరు టీ20ల అనుభవమే ఉంది. కానీ, ఫ్రాంచైజీ క్రికెట్లో మనోడు 145 మ్యాచులాడి 170 వికెట్లు పడగొట్టాడు. గతంలో చెన్నై, ముంబై జట్లకు ఆడిన గ్లీసన్‌ను ప్లే ఆఫ్స్‌లో అస్త్రంగా ఉపయోగించుకోనుంది ఆర్సీబీ.