LSG vs DC : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయ చూపించాడు. వస్తూ వస్తూనే డేంజరస్ కేఎల్ రాహుల్(39), మార్కస్ స్టోయినిస్(8), నికోలస్ పూరన్(0)లను పెవిలియన్ పంపాడు. దాంతో, లక్నో జట్టు 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇషాంత్ శర్మ ఓవర్లో దీపక్ హుడా(10) వెనుదిరిగాడు. అక్కడితో 12 పరుగుల వ్యవధిలో రాహుల్ సేన ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆయువష్ బదొని(5), కృనాల్ పాండ్యా(1)లు ఆడుతున్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 90/6.
పదిహేడో సీజన్లో వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్()కు ఆదిలోనే షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ , క్వింటన్ డికాక్(19) ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన డికాక్.. అతడి ఓవర్లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.
𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍
Kuldeep Yadav straight away unveiling his magic!👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA
— IndianPremierLeague (@IPL) April 12, 2024
దాంతో, 28 పరుగులు వద్ద లక్నో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత కాసేపటికే దేవ్‌దత్ పడిక్కల్(13)ను ఖలీల్ ఎల్బీగా దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత రాహుల్, స్టోయినిస్‌తో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసినా.. కుల్దీప్ ఎంట్రీతో లక్నో వికెట్ల పతనం మొదలైం