కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ రోజు వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ మైదానంలోకి దిగాడు. రెండో రోజు కీపింగ్ చేసిన వృద్ధిమాన్ సాహాకు మెడ నరాలు పట్టేయడంతో.. అతను ఇవాళ కీపింగ్ చేయడానికి రాలేదు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ సాహాకు చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎస్ భరత్‌కు అప్పగించారు. వికెట్ కీపర్‌గా రాణిస్తున్న రిషబ్ పంత్‌ను రెండు టెస్టులకు దూరం పెట్టిన విషయం తెలిసిందే. సాహాకు ట్రీట్మెంట్ జరుగుతోందని, అతని స్థానంలో భరత్ కీపింగ్ చేస్తాడని ఇవాళ బీసీసీఐ తన ట్విట్టర్లో తెలిపింది. సీనియర్ వికెట్ కీపర్ సాహా బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు.
సూపర్ క్యాచ్..
సబ్‌స్టిట్యూట్ భరత్ వచ్చీరాగానే ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో లో క్యాచ్‌ను పట్టేశాడు. యంగ్ బ్యాట్‌కు తగిలిన బంతిని భరత్ చాలా తక్కువ ఎత్తులో అందుకున్నాడు. వాస్తవానికి అంపైర్ ఆ క్యాచ్‌కు ఔట్ ఇవ్వలేదు. కానీ భరత్ చాలా కాన్ఫిడెంట్‌గా డీఆర్ఎస్కు అప్పీల్ చేశాడు. థార్డ్ అంపైర్ ఆ క్యాచ్‌ను ఔట్‌గా ప్రకటించాడు.
WHAT. A. CATCH! 🙌
— BCCI (@BCCI) November 27, 2021
Let's relive this brilliant glovework & DRS call from @KonaBharat
🎥 https://t.co/MkkXnnuc6M #TeamIndia #INDvNZ @Paytm