Australia A Squad : క్రికెట్ అభిమానులతో అలరారే భారత గడ్డపై ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) కుర్ర జట్టు సన్నద్ధమవుతోంది. ఉపఖండం పరిస్థితులను ఆకలింపు చేసుకునేందుకు భావి ఆసీస్ తారలు సెప్టెంబర్‌లో ఇండియా రాబోతున్నారు. భారత ‘ఏ’ జట్టుతో కంగారూ ‘ఏ’ జట్టు నాలుగు రోజుల, వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో గురువారం ఆ దేశ సెలెక్టర్లు పద్నాలుగు మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన నాథన్ మెక్ స్వీనే (Nathan McSweeney), సామ్ కొన్‌స్టాస్ (Sam Konstas)లతో పాటు స్పిన్నర్ టాడ్ మర్ఫీ కూడా ఈ బృందంలో ఉన్నాడు.
‘భారత ఉపఖండం క్రికెటర్లకు అనేక సవాళ్లు విసురుతుంది. ఎన్నో అవకాశాలను అందిస్తుంది. ఆటగాళ్లు తమ నైపుణ్యాలకు సానబెట్టుకునేందుకు ఎంతో పనికొస్తుంది. అలాంటి వాతావరణంలో ఆడడం వల్ల కుర్రాళ్లు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇలాంటి సిరీస్‌ల ద్వారా భవిష్యత్‌లో ఉపఖండం పర్యటనకు వాళ్లు పకడ్బందీగా సిద్ధం కాగలరు’ అని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ (Jeorge Bailey) అన్నాడు.
The National Selection Panel has picked two very exciting squads for the upcoming men’s Australia A tour of India next month 👀 pic.twitter.com/MwiYmwnm7i
— Cricket Australia (@CricketAus) August 7, 2025
భారత్ ఏ, ఆస్ట్రేలియా ఏ జట్లు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకూ తలపడుతాయి. ఇరు జట్ల మధ్య లక్నో వేదికగా సెప్టెంబర్ 16న తొలి మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 23-26న కూడా ఇదే మైదానంలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఉంటాయి. అనంతరం మూడు వన్డే మ్యాచుల్లో కుర్రాళ్ల సైన్యం అమీతుమీ తేల్చుకోనుంది. కాన్పూర్‌లో సెప్టెంబర్ 30న, అక్టోబర్ 3న, అక్టోబర్ 5న వన్డే మ్యాచుల్లో ఆతిథ్య జట్టును ఆసీస్ ఏ ఢీకొడుతుంది.
ఆస్ట్రేలియా ఏ నాలుగు రోజుల మ్యాచ్‌ల స్క్వాడ్ : గ్జావియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నొలి, జాక్ ఎడ్వర్డ్స్, అరోన్ హర్డీ, క్యాంప్‌బెల్ కెల్లవే, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌స్వీనే, లాన్సే మోరిస్, టాడ్ మర్ఫీ, ఫెర్గూస్ ఓనీల్, ఒలివర్ పీకే, జోష్ ఫిలిప్, కొరే రిచిసిలో, లియాం స్కాట్.
ఆస్ట్రేలియా ఏ వన్డే స్క్వాడ్ : కూపర్ కొన్నొలి, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలాయిట్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, అరోన్ హర్డీ, మెకెంజీ హర్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంగా, లియాం స్కాట్, లచీ షా, టామ్ స్ట్రేకర్, విల్ సథర్లాండ్, కల్లమ్ విడ్లర్.