IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్ జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మరో పోరుకు సిద్ధమైంది. భారీ లక్ష్యాలను ఊదిపడేస్తున్న శుభ్‌మన్ గిల్ సేన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను ఢీ కొడుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అజింక్యా రహానే బౌలింగ్ తీసుకున్నాడు.
ముల్లనూర్‌లో పంజాబ్‌పై చిత్తుగా ఓడిన కోల్‌కతా విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. మరోవైపు అద్భుత విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ గెలుపే లక్ష్యంగా ఆడనుంది. కోల్‌కతా స్పిన్ త్రయం మోయిన్, నరైన్, వరుణ్ రూపంలో గుజరాత్ బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫొర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్
ఇంప్యాక్ట్ సబ్స్ : ఇషాంత్ శర్మ, మహిపాల్ లొమ్రోర్, అనుజ్ రావత్, కరిమ్ జనత్, అర్షద్ ఖాన్.
🚨 Toss 🚨@KKRiders won the toss and elected to bowl against @gujarat_titans in Kolkata.
Updates ▶️ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT pic.twitter.com/Rof135hqli
— IndianPremierLeague (@IPL) April 21, 2025
కోల్‌కతా తుది జట్టు : రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, మోయిన్ అలీ, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఇంప్యాక్ట్ సబ్స్ : మనీశ్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ, రొవ్మన్ పావెల్, లవన్నీత్ సిసోడియా, అనుకుల్ రాయ్.