IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కొత్త మెంటార్ వేటలో పడింది. కోల్‌కతా జట్టు మూడో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడంలో కీలకమైన గౌతం గంభీర్(Gautam Gambhir) స్థానాన్ని భర్తీ చేయడంపై ఫ్రాంచైజీ దృష్టి పెట్టింది. 17వ సీజన్ తర్వాత గౌతీ.. టీమిండియా హెడ్‌కోచ్‌గా వెళ్లడంతో కొత్త మెంటార్ ఎంపిక కోల్‌కతాకు అనివార్యమైంది. 18వ సీజన్ మొదలయ్యే లోపే ఆ పని పూర్తి చేయాలని యాజమాన్యం పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్(Jacques Kallis)ను కేకేఆర్ ఫ్రాంచైజీ సంప్రదించినట్టు సమాచారం. గంభీర్ స్థానంలో మెంటార్‌గా కలిస్ అయితే బాగుంటుందని కోల్‌కతా యాజమాన్యం భావిస్తోంది. గతంలో ఈ లెజెండరీ ఆల్‌రౌండర్ కోల్‌కతాకు ఆడాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కన్సల్టెంట్గానూ ఆ జట్టుపై తన ముద్ర వేశాడు. అందుకని కలిస్‌ను మెంటార్‌గా తీసుకోవాలని కోల్‌కతా అనుకుంటోంది.
ఐపీఎల్ ట్రోఫీతో కోల్‌కతా ఆటగాళ్లు
ఇక కోచ్‌గా ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్(Ricky Ponting)ను నియమించేందుకు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం పావులు కదుపుతోంది. ఈమధ్యే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) పాంటింగ్‌ను కోచ్‌గా తొలగించింది. అయినా సరే బాధ పడకుండా.. ‘నేను మళ్లీ ఐపీఎల్లో కోచింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని ఆసీస్ లెజెండ్ ప్రకటించాడు. దాంతో, అతడి ఐపీఎల్ అనుభవాన్ని సొమ్ము చేసుకోవాలని కోల్‌కతా అనుకుంటోంది.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మెంటార్‌గా గౌతం గంభీర్ రాకతో ఆ జట్టు ఆటే మారిపోయింది. ఓపెనర్‌గా సునీల్ నరైన్(Sunil Narine).. ఫిల్ సాల్ట్(Phil Salt)లు విధ్వంసం సృష్టించగా.. మిస్సైల్ స్టార్క్ యార్కర్లతో బెంబేలెత్తించాడు.
ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్
ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టాడు. లీగ్ దశలో ఒక్క ఓటమి మినహా వరుస విజయాలతో కోల్‌కతా ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను కోల్‌కతా చిత్తుగా ఓడించింది. తొలుత హైదరాబాద్‌ను 113 పరుగులకే కట్టడి చేసిన కోల్‌కతా స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి 10 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
Srisailam Reservoir | శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
HYDRAA | మానవత్వం మరిచి వీధిన పడేసి.. అమానవీయంగా హైడ్రా పనితీరు : వీడియో
Duleep Trophy 2024 | ముషీర్, దయాల్ విజృంభణ.. ఇండియా బీ సంచలన విజయం
TG Rains | మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ