ఈడెన్‌లో ఫిల్ తుఫాను
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మళ్లీ విజయాల బాట పట్టింది. చెన్నైతో మ్యాచ్‌లో ఓటమి వైపు నిలిచిన కేకేఆర్.. సొంత ఇలాఖా ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అలవోక విజయం సాధించింది. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో చెలరేగాడు.
- లక్నో బౌలర్లను చితక్కొట్టిన కోల్‌కతా ఓపెనర్
- మూడు వికెట్లతో స్టార్క్ విజృంభణ
- కేకేఆర్ సునాయస విజయం
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మళ్లీ విజయాల బాట పట్టింది. చెన్నైతో మ్యాచ్‌లో ఓటమి వైపు నిలిచిన కేకేఆర్.. సొంత ఇలాఖా ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అలవోక విజయం సాధించింది. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో చెలరేగాడు. లక్నోలో పూరన్, రాహుల్ తప్ప మిగిలినవారంతా చేతులెత్తేశారు. మోస్తరు ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ లక్నో బౌలర్లపై సుడిగాలిలా విరుచుకుపడటంతో ఈ సీజన్లో కేకేఆర్ నాలుగో విజయాన్ని నమోదుచేసింది. లక్నోకు ఆరు మ్యాచ్‌లలో మూడో పరాజయం.
కోల్‌కతా: సొంత ఇలాఖా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి మళ్లీ గెలుపుబాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ముందు బంతితో మిచెల్ స్టార్క్ (3/28), సునీల్ నరైన్ (1/17)లు కట్టడిచేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమైంది. నికోలస్ పూరన్ (32 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఛేదనలో కోల్‌కతా ఓపెనర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఫిల్ సాల్ట్ (47 బంతుల్లో 89 నాటౌట్, 14 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 38 నాటౌట్, 6 ఫోర్లు) అండగా లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో ఆ జట్టు 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
ఆరంభంలో రాహుల్.. ఆఖర్లో పూరన్
లక్నో ఇన్నింగ్స్‌లో తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచిన క్వింటన్ డికాక్ (10) వైభవ్ అరోరా బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది. వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా (8) మరోసారి నిరాశపరచగా గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించిన అయుశ్ బదోని (29)తో కలిసి కెప్టెన్ రాహుల్ (27 బంతుల్లో 39, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లక్నో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని రస్సెల్ విడదీశాడు. రాహుల్ ఔట్ అయిన కొద్దిసేపటికే స్టోయినిస్ (10), బదోని కూడా పెవిలియన్ చేరారు. ఆఖర్లో పూరన్.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటంతో లక్నో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
సాల్ట్ ధనాధన్
మోస్తరు ఛేదనను కోల్‌కతా ధాటిగానే ఆరంభించింది. తొలి మ్యాచ్ ఆడుతున్న విండీస్ బౌలింగ్ సంచలనం షెమర్ జోసెఫ్ వేసిన తొలి ఓవర్లో 22 పరుగులు దండుకుంది. ఈ ఓవర్లో ఆఖరి బంతికి షార్ట్ ఫైన్ లెగ్ వద్ద యశ్ ఠాకూర్ క్యాచ్ మిస్ చేయడంతో వచ్చిన లైఫ్‌ను సాల్ట్ రెండు చేతులా ఒడిసిపట్టాడు. మోహ్సిన్ ఖాన్ వరుస ఓవర్లలో నరైన్ (6), రఘువంశీ (7)లను ఔట్ చేసినా సాల్ట్ మాత్రం దూకుడు తగ్గించలేదు. కృనాల్ రెండో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అతడు యశ్ ఠాకూర్, అర్షద్ ఖాన్ల బౌలింగ్‌లలో బౌండరీలతో హోరెత్తించాడు. 26 బంతుల్లోనే అతడి అర్ధ సెంచరీ పూర్తయింది. అర్ధ శతకం తర్వాత అతడి దూకుడు మరింత వేగం పుంజుకుంది. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్.. సాల్ట్ దూకుడుగా ఆడుతుండటంతో అతడికి అండగా నిలిచాడు. సాల్ట్ దూకుడుతో 15.4 ఓవర్లలోనే కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బౌలర్లలో మోహ్సిన్ తప్ప అందరూ తేలిపోయారు.
3 160 పరుగులకు పైగా లక్ష్యాలను నిర్దేశించి ఓడిపోవడం లక్నోకు ఇది మూడోసారి కాగా వరుసగా రెండోసారి. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నోకు పరాభవం ఎదురైంది. అంతకుముందు 13 సందర్బాల్లో లక్నో ఈ లక్ష్యాలను కాపాడుకుంది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో : 20 ఓవర్లలో 161/7 (పూరన్ 45, రాహుల్ 39, స్టార్క్ 3/28, నరైన్ 1/17) కోల్‌కతా: 15.4 ఓవర్లలో 162/2 (సాల్ట్ 89 నాటౌట్, శ్రేయస్ 38 నాటౌట్, మోహ్సిన్ 2/29)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

