ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లందరూ స్వస్థలాలకు వెళ్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్, ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాల్దీవులకు వెళ్లాడు. అక్కడి నుంచి మోర్గాన్ నేరుగా ఇంగ్లాండ్‌కు చేరుకుంటాడు. సహచర ఆటగాళ్లు కోల్‌కతా ఆటగాళ్లు పాట్ కమిన్స్, బెన్ కటింగ్, మెంటార్ డేవిడ్ హస్సీ కూడా మాల్దీవులు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఈనెల 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
మరోవైపు వార్నర్, స్టీవ్ స్మిత్ సహా 14 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లు మొత్తం 40 మందితో కూడిన ఆస్ట్రేలియా బృందం గురువారమే మాల్దీవులకు చేరింది. భారత్ నుంచి ఆసీస్‌కు విమాన ప్రయాణాలను అనుమతించే వరకు వారు అక్కడే ఉండనున్నారు.
#KKR Overseas Players & Support Staff Travel Update: 👋🏼 Goodbye to the Skipper, Mentor, Carnage Cummins and our ace all-rounder as they safely exit the Indian border into Maldives.
— KolkataKnightRiders (@KKRiders) May 7, 2021
Wishing you legends safe transit home & see you soon! 🏠 @DavidHussey29 #IPL2021 #StaySafe pic.twitter.com/mIsCplI97F
✈️ #KKR Overseas Players & Support Staff Travel Update: Good to know @1crowey, @JamesFoster07 and Nathan Leamon have safely made their way back to the UK. Now quarantine well, gentlemen! Stay safe, see you soon 💜#IPL2021 pic.twitter.com/lbu4NEkoMp
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2021