Dishant Yagnik : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) పక్కాగా సిద్ధమవుతోంది. వేలంలో మ్యాచ్ విన్నర్లను కొన్న ఆ ఫ్రాంచైజీ.. కోచింగ్ యూనిట్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లను నియమించుకున్న కోల్‌కతా.. తాజాగా ఫీల్డింగ్ కోచ్‌ను తీసుకుంది. దేశవాళీలో దంచికొట్టిన మాజీ క్రికెటర్ దిశాంత్ యాగ్నిక్ (Dishant Yagnik)కు బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని బుధవారం ఎక్స్ వేదికగా కోల్‌కతా వెల్లడించింది.
దేశవాళీ క్రికెట్లో రాజస్థాన్‌కు ఆడిన దిశాంత్ యాగ్నిక్ వికెట్ కీపర్, బ్యాటర్‌గా రాణించాడు. 2004-05లో ఫస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన దిశాంత్.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వీడ్కోలు అనంతరం రాజస్థాన్ జట్టుకు ఏడేళ్లు (2008-2025) ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్లో కోచింగ్ అనుభవమున్న అతడిని ఈసారి కోల్‌కతా పట్టేసింది.
𝙃𝙚’𝙨 𝙖 𝘾𝙖𝙩𝙘𝙝! Knights Army, welcome our new fielding coach, Dishant Yagnik! 🙌 pic.twitter.com/xuqzpMTVZ6
— KolkataKnightRiders (@KKRiders) January 21, 2026
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కోచింగ్ సిబ్బందిలో పలువురు దిగ్గజ ఆటగాళ్లున్నారు. భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించిన అభిషేక్ నాయర్ (Abhishek Nair) ఇప్పుడు ఆ టీమ్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పేస్ లెజెండ్ టిమ్ సౌథీ బౌలింగ్ కోచ్‌గా చేరాడు. మెంటర్‌గా డ్వేన్ బ్రావో, అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్, పవర్ కోచ్‌గా ఆండ్రూ రస్సెల్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా క్రిస్ డొనాల్డ్సన్లు కేకేఆర్ ఆటగాళ్లకు మెలకువలు నేర్పనున్నారు.
𝘏𝘰𝘸 𝘮𝘢𝘺 𝘸𝘦 𝘢𝘴𝘴𝘪𝘴𝘵 𝘺𝘰𝘶 𝘵𝘰𝘥𝘢𝘺? 😉☎️ pic.twitter.com/Re3IHx4ZMf
— KolkataKnightRiders (@KKRiders) January 15, 2026
పదిహేడో సీజన్లో అదరగొట్టిన కోల్‌కతా శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ట్రోఫీని ముద్దాడింది. గత సీజన్లో రహానే కెప్టెన్సీలో తీవ్రంగా నిరాశ పరిచింది ఆ జట్టు ఈసారి టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి కోచింగ్ యూనిట్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను దుర్భేద్యంగా మాలచుకుంది కోల్‌కతా ఫ్రాంచైజీ.