Virat Kohli | ‘బుమ్రా’ ఎనిమిదో వండర్.. ఎందుకో తెలుసా..?
Virat Kohli : పొట్టి ప్రపంచ కప్ విజేతల సన్మాన సభలో విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఏకంగా 'ఎనిమిదో వింత'గా విరాట్ అభివర్ణించాడు.
Virat Kohli : పొట్టి ప్రపంచ కప్ విజేతల సన్మాన సభలో విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించాడు. మెగా టోర్నీలో టీమిండియా అజేయ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఆకాశానికెత్తేశాడు. వాంఖడే స్టేడియంలో 36 వేల మంది అభిమానుల సమక్షంలో బుమ్రాను ఏకంగా ‘ఎనిమిదో వింత’గా విరాట్ అభివర్ణించాడు. అంతేకాదు బుమ్రాను ఎనిమిదో వండర్‌గా ప్రకటించడం కోసం తాను అఫిడవిట్లపై సంతకం పెడుతానని కోహ్లీ తెలిపాడు.
‘విక్టరీ పరేడ్’ అనంతరం వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ప్రజెంటర్ గౌరవ్ కపూర్ వేదికమీదికి పిలవగానే .. బార్బడస్లోని కెన్సింగ్టన్ ఓవల్(Kensington Oval)లో ఆద్యంత ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడాడు. ‘ఒకానొక దశలో మ్యాచ్ మళ్లీ చేజారుతుంది అనిపించింది. ఆ దశలో ఆఖరి ఐదు ఓవర్లు నిజంగా అద్భుతం. వాటిలో బుమ్రా వేసిన రెండు ఓవర్లు అయితే చాలా స్పెషల్. వరల్డ్ కప్‌లో జట్టును ప్రతిసారి పోటీలోకి తెచ్చిన బుమ్రాను అందరూ అభినందించాల్సిందే.

అందుకని అతడు వీలైనన్ని రోజు భారత జట్టుకు ఆడాలని అందరం కోరుకుందాం. బుమ్రాను ప్రపంచంలోని ఎనిమిదో వండర్‌గా ప్రకటించేందుకు అవసరమైన కాగితాలపై నేను సంతకం చేస్తాను. అంతేకాదు ఒకతరంలో కనిపించే మేటి బౌలర్ అతడు. అతడు మనతో కలిసి ఆడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని కోహ్లీ వెల్లడించాడు.
This Day. This Celebration. This Reception 💙#TeamIndia | #T20WorldCup | #Champions pic.twitter.com/nhdoqqVUzU
— BCCI (@BCCI) July 4, 2024
జాన్సెన్ వికెట్ తీసి..
వరల్డ్ కప్‌లో బుమ్రా తానొక చాంపియన్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి వికెట్ తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఈ యార్కర్ కింగ్ తన మార్క్ చూపించాడు. సఫారీల విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన వేళ బంతి అందుకున్న బుమ్రా.. మార్కో జాన్సెన్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

ఇక ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 8 పరుగులే ఇవ్వడంతో భారత జట్టు రెండోసారి టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. మెగా టోర్నీలో 15 వికెట్లతో రాణించిన బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.
वंदे मातरम 🇮🇳 pic.twitter.com/j5D4nMMdF9
— BCCI (@BCCI) July 4, 2024
ఇవి కూడా చదవండి
- Canada Open | క్వార్టర్స్‌లో రజావత్.. డబల్స్‌లో త్రిసా-గాయత్రి ముందంజ
- Amritpal Singh | జైలు నుంచి గెలుపొంది.. ఎంపీగా ప్రమాణం చేసిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్
- Assam Floods | వరదలకు అస్సాం అస్తవ్యస్థం.. 52కు పెరిగిన మృతులు.. 21 లక్షల మందిపై ప్రభావం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

