Amritpal Singh | జైలు నుంచి గెలుపొంది.. ఎంపీగా ప్రమాణం చేసిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్
Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు (Radical Sikh preacher) అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) లోక్‌సభ సభ్యుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు (Takes Oath As MP).
Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు (Radical Sikh preacher) అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) లోక్‌సభ సభ్యుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు (Takes Oath As MP). ఇటీవలే జరిగిన లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్‌పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకరాం చేశారు.
వారిస్ పంజాబ్ దే అధిపతి అయిన అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ధిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. అయితే, ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అమృత్‌పాల్‌కు అమృత్సర్ జిల్లా మెజిస్ట్రేట్ పెరోల్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు షరతులతో కూడిన పెరోల్ ఇచ్చింది. కారాగారం నుంచి ఢిల్లీకి వెళ్లి, తిరిగి కారాగారానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఢిల్లీని వదిలి మాత్రం ఎక్కడికీ వెళ్లకూడదని పేర్కొంది. ఢిల్లీలో ఉన్నప్పుడు అమృత్‌పాల్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ మీడియా ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేసింది.
ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంజినీర్ రషీద్
మరోవైపు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన శుక్రవారం రెండు గంటల పెరోల్‌పై వచ్చి 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రషీద్ (Engineer Rashid) భార్య, ముగ్గురు పిల్లలు, సోదరుడు సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రషీద్ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
Also Read..
Engineer Rashid | ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంజినీర్ రషీద్
Assam Floods | వరదలకు అస్సాం అస్తవ్యస్థం.. 52కు పెరిగిన మృతులు.. 21 లక్షల మందిపై ప్రభావం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

