RCB vs CSK : చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి చెన్నై స్పిన్ ఉచ్చు బిగించింది. వాన తగ్గాక బంతి బాగా టర్న్ కావడంతో ఆర్సీబీ ఓపెనర్లు రన్స్ తీయలేక ఇబ్బంది పడ్డారు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత దంచుడు మొదలెట్టిన ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ(47) ఔటయ్యాడు.
శాంట్నర్ వేసిన 10వ ఓవర్లో సిక్సర్ బాదిన విరాట్.. ఆ తర్వాత బంతికి భారీ షాట్ ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న డారిల్ మిచెల్ బంతిని అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో, 78 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్లో కెప్టెన్ డూప్లెసిస్ 30 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 78/1.